Tollywood: అరె.! హీరోయిన్ మెటీరియల్‌ను సిస్టర్‌ను చేసేశారుగా.. దోచేయ్ బ్యూటీ ఇప్పుడెలా ఉందంటే.?

అక్కినేని నాగచైతన్య కెరీర్‌లో వన్ ఆఫ్ ది మాస్ మూవీ 'దోచేయ్'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా.. చైతూను కొత్తగా చూపించింది. ఈ మూవీలో కృతి సనన్ హీరోయిన్ కాగా.. చెల్లి క్యారెక్టర్‌లో నటించిన అమ్మాయి ఎవరో గుర్తు పట్టరా.?

Tollywood: అరె.! హీరోయిన్ మెటీరియల్‌ను సిస్టర్‌ను చేసేశారుగా.. దోచేయ్ బ్యూటీ ఇప్పుడెలా ఉందంటే.?
Actress
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 14, 2025 | 11:40 AM

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య.. తన కెరీర్‌లో ఎప్పుడూ వైవిధ్యమైన కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చాడు. అందులో ఒకటి ‘దోచేయ్’. 2015లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ.. చైతూను కొత్తగా చూపించింది. కృతి సనన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో చైతూకు చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా.? లలితా క్యారెక్టర్‌లో ఆమె నటనకుగానూ మంచి మార్కులు పడ్డాయి. మరి ఇంతకీ ఆమె ఎవరు.? ఇప్పుడేం చేస్తుందో తెలుసుకుందామా..

ఆ అమ్మాడి మరెవరో కాదు.. తనయ సచ్‌దేవా. ముంబైలో పుట్టి పెరిగిన ఈ చిన్నది.. పలు హిందీ, తెలుగు చిత్రాల్లో నటించింది. సినీ ఇండస్ట్రీకి రాకముందు మోడలింగ్ ద్వారా పలు పాపులర్ యాడ్స్‌లో నటించింది. ‘కహి సుని’ అనే టీవీ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న తనయ.. హిందీలో ‘పరచేడ్’ అనే బోల్డ్ మూవీతో బీ-టౌన్‌కు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో ‘దోచేయ్’ చిత్రంతో అరంగేట్రం చేసింది. పలు ప్రైవేటు ఆల్బమ్ సాంగ్స్‌తో పాటు ఓపీఎస్, లవ్ స్కాండల్స్ & డాక్టర్స్ లాంటి వెబ్ సిరీస్‌లలో అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. లేటెస్ట్ అప్‌డేట్స్, హాట్ హాట్ పోజులతో కుర్రాళ్లకు హీట్ పెంచుతోంది. మరి లేట్ ఎందుకు ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి