Tollywood: సాదాసీదాగా కనిపిస్తోన్న ఈ చిన్నది.. ఇప్పుడు అందాల అటామ్ బాంబ్.. ఎవరో గుర్తుపట్టారా.?
స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలంటే అంత ఈజీ కాదు. దర్శకుడు ఇచ్చే ప్రతీ పాత్రకు న్యాయం చేయాలి. అలాగే గ్లామర్ పాత్రలకు మాత్రమే కాదు.. డీ గ్లామరైజ్డ్ రోల్స్‌కి సైతం సై అనాల్సిందే. అందుకే ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు పాత్ర ఏదైనా.. నిడివి తక్కువైనా సరే అని అంటున్నారు.
సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అంత ఈజీ కాదు. గ్లామర్ పాత్రలకే కాదు.. డీ గ్లామరైజ్డ్ రోల్స్‌కి సైతం సై అనాల్సిందే. అలాగే డైరక్టర్ చెప్పిన ప్రతీ పాత్రకు న్యాయం చేయాల్సి ఉంటుంది. స్క్రీన్‌పై పాత్ర నిడివి తక్కువ ఉన్నప్పటికీ.. ఇంపాక్ట్ గట్టిగా ఉండే పాత్రలతోనే ఈ మధ్యకాలంలో చాలామంది నటీమణులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ కోవకు చెందిన బ్యూటీనే ఈమె. ఈ అమ్మడికి డీ-గ్లామర్ రోల్స్‌తో అవార్డులు వచ్చాయి. పైన కనిపిస్తోన్న ఈ చిన్నది ఎవరో ఇప్పటికైనా గుర్తొచ్చిందా.? స్క్రీన్‌పై సింపుల్‌గా కనిపించే ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.
ఆమె మరెవరో కాదు.. మన తెలుగు అమ్మాయి సాయి కామాక్షి భాస్కర్ల. చైనాలో డాక్టర్ పట్టా పొందిన ఈ చిన్నది.. మొదట్లో కొంతకాలం అపోలో హాస్పిటల్‌గా వైద్యురాలిగా పని చేసింది. ఆ తర్వాత 2018లో మిస్ తెలంగాణగా అవార్డు సాధించింది. దీంతో వరుసగా సినీ అవకాశాలు కామాక్షి భాస్కర్ల తలుపు తట్టాయి. ‘ప్రియురాలు’ అనే మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ‘మా ఊరి పొలిమేర’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘విరూపాక్ష’, ‘పొలిమేర 2’, ‘ఓం భీమ్ బుష్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ‘మా ఊరి పొలిమేర’, ‘పొలిమేర 2’ మూవీస్ ఈ అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆమె నటనకు గానూ మంచి మార్కులు పడ్డాయి
‘ఝాన్సీ’, ‘సైతాన్’, ‘దూత’ లాంటి వెబ్ సిరీస్‌ల్లోనూ కనిపించిన కామాక్షి భాస్కర్ల.. అందులోనూ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే చేసింది. సినిమాల్లో సింపుల్‌గా.. సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోన్న ఈ బ్యూటీ హాట్ పోజులతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. లేట్ ఎందుకు ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి