Sankranthiki Vasthunnam : వెంకీ మామ సినిమా అంటే అట్లుంటది మరీ.. నార్త్ అమెరికాలో కలెక్షన్స్‌‏ను కుమ్మేస్తున్న వెంకటేశ్‌ సినిమా..

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ నటించిన లేటేస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. పక్కా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి పండగా సందర్భంగా ఈ సినిమా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది.

Sankranthiki Vasthunnam : వెంకీ మామ సినిమా అంటే అట్లుంటది మరీ.. నార్త్ అమెరికాలో కలెక్షన్స్‌‏ను కుమ్మేస్తున్న వెంకటేశ్‌ సినిమా..
Venkatesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 14, 2025 | 1:22 PM

సంక్రాంతి సినిమాల వసూళ్లు పోట్ల గిత్తెల వలె పరుగులు పెడుతున్నాయి. తాజాగా సంక్రాంతి నాడు రిలీజ్‌ అయిన వెంకటేశ్‌ సినిమా ఓ రేంజ్‌లో విక్టరీ మోత మోగిస్తోంది. వెంకీ మామ ఆల్రెడీ కలెక్షన్ల సునామీ షురూ చేశాడు. విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి కానుకగా మంగళవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తాజాగా ఈ సినిమా కొన్ని గంటల్లోనే నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద 350K డాల్లర్స్ వసూళ్లను సాధించినట్లు సమాచారం. విషయాన్నీ మేకర్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల నుండి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశముంది. ప్రతీ సంక్రాంతి ఆనవాయితీ మాదిరిగానే ఈసారి కూడా చివరగా రిలీజ్ అయినా సినిమా కలెక్షన్స్ ఎగరేసుకుపోతోంది.

ఇప్పటికే నెటిజన్స్‌ ఈ సినిమాకి మంచి మార్క్స్ వేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ ఫెస్టివల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బుల్లి రాజు పాత్రలో వెంకీ ఆకట్టుకున్నాడు అంటున్నారు. ప్రత్యేకంగా మ్యూజిక్ సినిమాని ఎలివేట్ చేసిందని టాక్. ఇక క్రాఫ్ట్ పరంగా చూసుకుంటే సినిమా డీసెంట్ గానే ఉందని చెబుతున్నారు. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి తన రొటీన్ కామెడీ ట్రాక్‌ను మరోసారి ప్రయోగించి సక్సెస్‌ అయినట్లు చెబుతున్నారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..