AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్.. ఈ చిన్నది వంటలక్క కూతురా..! ఎంత క్యూట్‌గా ఉందో చూడండి..

టీవీ సీరియల్‌లో ఎక్కువ క్రేజ్ ఉన్న సీరియల్ ఏది అంటే చాలా మంది టక్కున చెప్పే పేరు కార్తిక దీపం. ఈ సీరియల్‌కు ఇంతగా క్రేజ్ ఎందుకు వచ్చింది అంటే దానికి కారణం వంటలక్క వల్లే అనే చెప్పాలి. ఈ సీరియల్ కు మంచి టీఆర్పీతో దూసుకుపోతుంది. స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి సమయంలో ప్రసారం అయ్యే ఈ సీరియల్ కోసం ఆడాళ్ళు తెగ ఎదురుచూస్తారు.

అమ్మబాబోయ్.. ఈ చిన్నది వంటలక్క కూతురా..! ఎంత క్యూట్‌గా ఉందో చూడండి..
Vantalakka
Rajeev Rayala
|

Updated on: Jan 14, 2025 | 2:08 PM

Share

సినిమాతో పాటు ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడేవి సీరియల్స్. సినిమాలైనా ఏడాదికి మూడు నాలుగే వస్తాయి.. కానీ సీరియల్స్ మాత్రం ప్రతిరోజూ టీవీలో వస్తూ.. మూడు, నాలుగు ఏళ్లు సాగుతుంటాయి. అందుకే సీరియల్స్ కు మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లు సీరియల్స్ అంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు. ఇప్పుడు డిజిటల్ హావ నడుస్తుండటంతో ఓటీటీల్లో రిపీటెడ్ గా చూస్తున్నారు మన లేడీస్.. ఇక సీరియల్స్ లో తోపు సీరియల్ ఏది అంటే టక్కున చెప్పే పేరు కార్తీక దీపం.. ఎంతో మంది ఫెవరేట్ సీరియల్ ఇది. ఈ సినిమాలో వంటలక్కకు ఉన్న క్రేజ్ ఏ సినీ స్టార్ కు ఉండదు. సీరియల్ కంటే వంటలక్క పాత్ర బాగా ఫెమస్ అయ్యింది.

ఇది కూడా చదవండి : ఏంటీ..! మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయినా.! అదికూడా తెలుగమ్మాయి

స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి సమయంలో ప్రసారం అయ్యే ఈ సీరియల్ కోసం ఆడాళ్ళు తెగ ఎదురుచూస్తారు. ఈ సీరియల్ లో వంటలక్క తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆమె పేరు ప్రేమి విశ్వనాథ్. ఈ నటి కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క పాత్రలో నటించి మెప్పించింది.. ప్రేమి విశ్వనాథ్ కేరళ రాష్ట్రానికి చెందిన నటి..కానీ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వంటలక్క పాత్రలో ఆమె అద్భుతంగా నటించి మెప్పించింది.

ఇది కూడా చదవండి :Srihari: వాడు నా అయ్య..! శ్రీహరి నాన్న అని పిలిచే ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా.?

నటి ప్రేమి విశ్వనాథ్ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.. ఆమె ఫ్యామిలీ ఏంటి.? బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ నటి రెగ్యులర్ గా తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఆమె కూతురి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న చిన్నది రియల్ కూతురు కాదు. రీల్ కూతురు. కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురిగా నటించిన చిన్నారి. కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క కూతురు శౌర్యగా నటించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించినా చైల్డ్ ఆర్టిస్టే బేబీ కృతిక. బేబీ కృతిక చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసింది. అలాగే పలు సీరియల్స్ లోనూ నటించింది. ఇప్పుడు ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతో క్యూట్ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో క్రేజీ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ చిన్నది.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..