UGC-NET 2024 Reschedule: యూజీసీ నెట్ పరీక్షల తేదీలు మారాయ్.. కొత్త షెడ్యూల్ ఇదే
యూజీసీ నెట్-2025 డిసెంబర్ సెషన్ పరీక్షలు ఆన్ లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు (జనవరి 15) జరగవల్సిన పరీకలు మాత్రం సంక్రాంతి పండగ నేపథ్యంలో వాయిదా పడింది. అయితే ఈ రోజు పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో ఆ తేదీలను ఎన్టీయే తాజాగా వెల్లడిస్తూ ప్రకటన జారీ చేసింది..
న్యూఢిల్లీ, జనవరి 15: యూజీసీ నెట్-2025 పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (NTA) సంక్రాంతి పండగ నేపథ్యంలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జనవరి 15న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసింది. ఈ క్రమంలో పలు సబ్జెక్ట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను జనవరి 21, 27 తేదీల్లో నిర్వహించేందుకు రీషెడ్యూల్ చేసినట్లు యూజీసీ ప్రకటించింది. ఈ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు నిర్వహించనుంది. ఈ మేరకు పరీక్షల రీ షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది.
జనవరి 21వ తేదీన.. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, మలయాళం, ఉర్దూ, లేబర్ వెల్ఫేర్/ పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్/ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్, క్రిమినాలజీ, ట్రైబల్ అండ్ రీజనల్ ల్యాంగ్వేజ్/ లిటరేచర్, ఫోక్ లిటరేచర్, కొంకణీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్.. సబ్జెక్టుల్లో ఉదయం సెషన్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఇక జనవరి 27వ తేదీన.. సంస్కృతం, మాస్ కమ్యునికేషన్ అండ్ జర్నలిజం, జపనీస్, పర్ఫామింగ్ ఆర్ట్- డ్యాన్స్/ డ్రామా/ థియేటర్, ఎలక్ట్రానిక్ సైన్స్, విమెన్ స్టడీస్, లా, నేపాలీ.. సబ్జెక్టుల్లో నెట్ పరీక్ష మధ్యాహ్నం సెషన్‌లో జరుగుతుంది.
మొత్తం 85 సబ్జెక్టుల్లో యూజీసీ నెట్ పరీక్షలు జరుగుతాయి. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జనవరి 3, 6, 7, 8, 9, 10, 15, 16 తేదీల్లో యూజీసీ నెట్ పరీక్షలు జరగాలి. అయితే సంక్రాంతి కారణంగా 15వ తేదీ పరీక్ష జనవరి 21, 27వ తేదీలకు మారాయి. నెట్ పరీక్ష మొత్తం 2 పేపర్లకు జరుగుతుంది. పేపర్ 1లో రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైరెర్జంట్ థింకింగ్, జనరల్ అవేర్‌ననెస్‌పై ప్రశ్నలు ఉంటాయి. ఇక పేపర్ 2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్‌లో ప్రశ్నలు వస్తాయి. లాంగ్వేజెస్ మినహా మిగతా అన్ని క్వశ్చన్‌పేపర్లు ఇంగ్లిష్, హిందీ మీడియంలో మాత్రమే వస్తాయి. రిజర్వ్‌డ్ కేటగిరీ వారికి 35 శాతం, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి 40 శాతం మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.