AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సాగు చేస్తున్న ప్రతి గ్రామంలో యూరియా కొరత… ఎందుకొచ్చిందీ పరిస్థితి?

వెల్‌కమ్‌ టు బర్నింగ్‌ టాపిక్‌... రబీ గానీ, ఖరీఫ్‌ గానీ.. సాగు సీజన్ మొదలయ్యాక రైతుకు వచ్చే మొదటి కష్టం.. యూరియా. పైగా తెలంగాణలో వరి పంట చాలా ఎక్కువ. వరి సాగుకే ఈ యూరియా వాడకం ఎక్కువ. మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలీదా ఎంత అవసరం ఉందో? రాష్ట్రంలో యూరియా వాడకం ఎంతో తెలుసు కాబట్టే తమకింత కావాలని ముందే కేంద్రాన్ని అడిగాం అంటోంది తెలంగాణ ప్రభుత్వం. మరి అడిగినంతా ఇవ్వలేదా కేంద్రం? ఓవైపు వచ్చిన స్టాక్‌ వచ్చినట్టే ఇచ్చేస్తుంటే.. ఇంకా మామీద పడిపోతారేంటి అంటోంది కమలదళం. ఇచ్చిన యూరియా బస్తాలు పంచడం చేతగాక ఈ ఆరోపణలేంటి అనేది బీజేపీ వాయిస్. నిజంగానే పంపిణీలో తేడా జరిగిందా? అంతేకదా మరి అని వాయిస్‌ పెంచుతోంది ప్రతిపక్షం. 11 ఏళ్లలో ఎప్పుడూ రాని యూరియా కొరత ఇప్పుడే వచ్చిందంటే కారణం పాలనపై గ్రిప్‌ లేకపోవడమేగా అని విమర్శ అందుకుంది గులాబీదళం. ఓవరాల్‌గా.. స్థానిక ఎన్నికల సమరాన్ని ముందు పెట్టుకుని ఇప్పుడీ సమస్యను పరిష్కరించకపోతే ఎవరికి నష్టం? అసలు.. ఎన్నికల సమయంలోనే ఎందుకు పుట్టుకొచ్చిందీ సమస్య? యూరియాపై యాగీ ఏంటసలు?

Telangana: సాగు చేస్తున్న ప్రతి గ్రామంలో యూరియా కొరత... ఎందుకొచ్చిందీ పరిస్థితి?
Telangana Urea Shortage
Ram Naramaneni
|

Updated on: Aug 21, 2025 | 10:14 PM

Share

అసలే ఈ సీజన్‌ లేట్‌ అయింది. కుండపోత వర్షాలతో ఇప్పుడిప్పుడే వ్యవసాయ పనులు జోరందుకుంటున్నాయి. సద్ది కట్టుకుని ఇంటిల్లిపాది పొలాల్లో దిగితేనే సాగు సాగేది. కాని, అదే సద్ది మూట పట్టుకుని ఇంటిల్లిపాది ఎరువుల దుకాణాల ముందు క్యూ కట్టాల్సి వస్తోంది. ఓవైపు కాలం వెళ్లిపోతోంది. ఇంకోవైపు యూరియా బస్తా చేతికందలేదు. సాయంత్రం దాకా క్యూలో ఉన్నందుకు ఒకట్రెండు బస్తాలొస్తే అదే గొప్ప. తెలంగాణలో ఏ గ్రామంలోని రైతును కదిపినా ఇవే కష్టాలు చెబుతున్నాడు. ఇన్నేళ్లలో ఎప్పుడూ రాని యూరియా కొరత ఇప్పుడే ఎందుకొచ్చిందనేది అసలు ప్రశ్న. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. తెలంగాణలో ఒక కోటి 32 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు అవుతోంది. రాష్ట్ర అవసరాలు తీరాలంటే కనీసం 12 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం అని ఒక అంచనా. అయితే ఈ వానాకాలానికి గాను 10 లక్షల 40వేల మెట్రిక్‌ టన్నుల యూరియా ఇస్తే సరిపోతుందని ఓ లెక్క గట్టి కేంద్రాన్ని అడిగింది రాష్ట్రం. కేంద్రం తన దగ్గరున్న స్టాక్‌ ఎంతో చూసుకుని ఈ వర్షాకాలానికి 9 లక్షల 80 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందులో ఈ ఆగస్ట్‌ నాటికి 8 లక్షల 30వేల మెట్రిక్‌ టన్నుల యూరియా తెలంగాణకు రావాల్సి ఉంది. కాని, ఇప్పటి వరకు అందింది మాత్రం 5 లక్షల 32వేల మెట్రిక్‌ టన్నుల యూరియా మాత్రమే. అయితే.. ఆల్రడీ...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి