AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: 81 ఏళ్ల వృద్ధుడికి వలపు వల.. నిండా ముంచిన కేటుగాళ్లు.. ఏం చేశారో తెలిస్తే..

ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు రోజుకో కొత్తరకం మోసాలతో జనాలకు కుచ్చుటోపీలు పెడుతున్నారు. జనాలు కూడా ఈ మోసగాళ్లను ఈజీగా నమ్మి కష్టపడి సంపాధించి డబ్బును మొత్తం పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. అమీర్ పేటకు చెందిన ఓ 81 ఏళ్ల వృద్ధుడిని వాట్పాస్‌ మెసేజెస్‌తో హానీ ట్రాప్‌లోకి దించిన కేటుగాళ్లు అతడి నుంచి అందినకాడికి దోచుకున్నారు.

Hyderabad: 81 ఏళ్ల వృద్ధుడికి వలపు వల.. నిండా ముంచిన కేటుగాళ్లు.. ఏం చేశారో తెలిస్తే..
Cyber Crime
Anand T
|

Updated on: Aug 21, 2025 | 9:54 PM

Share

ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు రోజుకో కొత్తరకం మోసాలతో జనాలకు కుచ్చుటోపీలు పెడుతున్నారు. జనాలు కూడా ఈ మోసగాళ్లను ఈజీగా నమ్మి కస్టపడి సంపాధించి డబ్బును మొత్తం పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అమీర్ పేట్‌కు చెందిన 81 ఏళ్ల వృద్ధుడికి జూన్‌ నెలలో మాయ రాజ్‌పుత్ అనే మహిళ పేరుతో వాట్సాప్‌లో కాల్స్, మెసేజ్స్ చేశారు స్కామర్స్. ఆయనతో చనువుగా మాట్లాడుతూ, మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్న కేటుగాళ్లు.. చనువు ఏర్పడ్డాక తమ ప్లాన్‌ను అమలు చేయడం స్టార్ట్ చేశారు.

తనతో చాట్‌ చేస్తున్న మహిళకు ఎన్నో కష్టాలు ఉన్నట్టు.. వైద్య ఖర్చులు, తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను విడిపించాలని.. అందుకు కొన్ని డబ్బులు కావాలని అతనితో చెప్పడం స్టార్ట్ చేశారు. అది నిజమేనని నమ్మిన వృద్దుడు పలు దఫాలుగా తన చాట్‌ చేస్తున్న కేటుగాళ్లు ఇచ్చిన నంబర్‌కు డబ్బులు పంపడం స్టార్ట్ చేశారు. ఇలా ఆ వృద్ధుడి నుంచి మొత్తం రూ. 7 లక్షల 11 వేలు వరకు కాజేశారు కేటుగాళ్లు.

అక్కడితో ఆగకుండా ఇంకా తమకు డబ్బులు కావాలని కేటుగాళ్లు ఆ వృద్దుడిని ఎమోషనల్‌ బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు తమ కుటుంబ సభ్యుల సహాయంతో సైబర్ క్రైమ్ పోలీసులకును ఆశ్రయించాడు. జరిగిన విషయం మొత్తం పోలీసులు చెప్పి ఘటనపై ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే