Union Budget 2021: తెలుగు రాష్ట్రాలపై కేంద్ర మంత్రి నిర్మలా శీతకన్ను.. అంచనాలను అందుకోలేకపోయిన తెలంగాణ రాష్ట్ర కేటాయింపులు

Union Budget 2021: తెలుగు రాష్ట్రాలపై కేంద్ర మంత్రి నిర్మలా శీతకన్ను.. అంచనాలను అందుకోలేకపోయిన తెలంగాణ రాష్ట్ర కేటాయింపులు

కేంద్ర బడ్జెట్‌‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు అంతంత మాత్రంగానే కేటాయింపులు జరిగాయి

Balaraju Goud

| Edited By: Pardhasaradhi Peri

Feb 02, 2021 | 4:41 PM

Budget 2021 Funds  Telangana : కేంద్ర బడ్జెట్ 2021-22 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు అంతంత మాత్రంగానే కేటాయింపులు జరిగాయి. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతోపాటు మిషన్‌‌ కాకతీయ, మిషన్‌‌ భగీరథ పథకాలకు ఆర్థిక సాయం అందుతుందని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి భంగపాటు తప్పలేదు.

కేంద్రం పెట్టిన కొత్త బడ్జెట్​ ప్రకారం వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్రానికి రూ.34 వేల కోట్ల వరకు అందనున్నాయి. రాష్ట్ర సర్కారు పదే పదే విజ్ఞప్తి చేసిన మిషన్​ భగీరథకు ఆర్థిక సాయం అందించాలని ఫైనాన్స్ కమిషన్​ రికమెండ్​ చేయడం ఆశలు రేకెత్తించింది. ఈ స్కీమ్​కు రూ.2,350 కోట్లు సాయం అందనుంది. ఇక అగ్రికల్చర్​ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్​ కింద రూ.1,665 కోట్లు రానున్నాయి. గతంతో పోలిస్తే కేంద్ర పన్నుల్లో వాటా నిధులు కాస్త తగ్గినా.. జీఎస్టీ పరిహారం అందనుంది. కొత్తగా హెల్త్ గ్రాంట్​ను ఫైనాన్స్​ కమిషన్ ​రికమెండ్​ చేయడంతో మరిన్ని నిధులు రాష్ట్రానికి అందనున్నాయి. జీఎస్టీ పరిహారంతో ఊరట

ఏటా కేంద్రం నుంచి పన్నుల వాటా (టాక్స్​ డెవల్యూషన్)​తోపాటు ఫైనాన్స్​ కమిషన్​ గ్రాంట్లు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్​ల నిధులు రాష్ట్రాలకు చేరనున్నాయి. సెంట్రల్​ జీఎస్టీ, ఇన్​కమ్​ ట్యాక్స్, సీజీఎస్టీ, కస్టమ్స్​ ట్యాక్స్, ఎక్సైజ్​ డ్యూటీ, సర్వీస్​ టాక్స్, కార్పొరేట్​ ట్యాక్సుల ద్వారా కేంద్రానికి సమకూరే ఆదాయంలో రాష్ట్రాలకు 6.65 లక్షల కోట్లను పంపిణీ చేయనుంది. అందులో నిర్ణీత వాటా ప్రకారం 2.102 శాతం నిధులు.. అంటే రూ.13,990 కోట్లు తెలంగాణ రాష్ట్ర ఖజానకు రానున్నాయి. 2021–-22 ఫైనాన్షియల్​ఇయర్​లో జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రానికి రూ.2,136 కోట్లు ఇవ్వాలని ఫైనాన్స్​ కమిషన్​సిఫార్సు చేసింది. ఈ మేరకు అదనంగా తెలంగాణకు నిధులు రానున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న సెంట్రల్​ స్పాన్సర్డ్ స్కీమ్‌ల కింద రూ.10,900 కోట్లు వస్తాయని ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర గ్రాంట్ల రూపంలో మరో రూ.3,541 కోట్లు వస్తాయని చెప్తున్నారు.

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ.2,037 కోట్ల గ్రాంట్ రిలీజ్​చేస్తున్నట్లు కేంద్ర ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు ప్రత్యేకంగా రూ.354 కోట్లు, డిజాస్టర్​ మేనేజ్​మెంట్​సాయం కింద రూ.599 కోట్లు కేటాయించారు. గ్రామీణ సడక్​ యోజన, జ్యుడిషియరీ, స్పెషల్​ గ్రాంట్లుగా మరో 132 కోట్లు విడుదలవుతాయి. కరోనా ఎఫెక్ట్​తో కేంద్రం ఈసారి పబ్లిక్​ హెల్త్​కు బడ్జెట్లో ప్రయారిటీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రానికి రూ.419 కోట్ల హెల్త్​ గ్రాంట్ దక్కనుంది. పీహెచ్​సీల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ అండ్​ వెల్​నెస్​ సెంటర్లు, డయాగ్నస్టిక్ సెంటర్లను డెవలప్​ చేసేందుకు, అప్​గ్రేడ్​ చేసేందుకు వాటిని ఖర్చు చేస్తారు.

తెలంగాణకు సంబంధించిన కేటాయింపులను ఓ సారి పరిశీలిస్తే.. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఫిబ్రవరి నాటికీ కోటి 80 లక్షల లబ్దిదారులకు ప్రయోజనం చేకూరనున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద రూ.130.36 కోట్లు, పీఎం కిసాన్ 33,31,468 మంది లబ్దిదారులకు కేంద్రం నుంచి ప్రయోజనం అందుతుంది. ఇక, ఫిబ్రవరి నాటికీ ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం ద్వారా 52,60,800 మంది లబ్దిదారులకు వారి వారి ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు వారి ఖాతాల్లో ఈపీఎఫ్ ద్వారా రూ.102.3362 కోట్లు జమ చేసినట్లు కేంద్ర వెల్లడించింది.

అయితే, తెలంగాణ ప్రభుత్వం ఈసారి కేంద్ర బడ్జెట్​పై భారీగానే ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో తాత్కాలిక బడ్జెట్​ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇందులో కేంద్రం నుంచి రూ. 43,418 కోట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ, తాజా బడ్జెట్‌లో కేంద్రం మన రాష్ట్రానికి రూ.32,632 కోట్లు మాత్రమే కేటాయించింది. దీంతో రూ. 10,785 కోట్ల మేరకు రాష్ట్ర అంచనాలకు గండిపడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి మొత్తం రూ. 32,632 కోట్లు వస్తాయని రాష్ట్ర ఆర్థిక శాఖ విశ్లేషిస్తోంది. ఇదిలావుంటే, గత ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటా, గ్రాంట్ల ద్వారా రాష్ట్రానికి రూ. 30,308 కోట్లు కేటాయించింది. ఆశించినంత ఆదాయం రాలేదని సవరించిన బడ్జెట్​లో వెయ్యి కోట్లు కోత పెట్టింది. గత బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రానికి అదనంగా రూ.2,324 కోట్లు దక్కాయి.

కేంద్ర పన్నుల్లో మన వాటా(రూ.కోట్లలో)

‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెంట్రల్‌ జీఎస్టీ 5,369.67

కార్పొరేట్‌ ట్యాక్స్‌ 6,718.49

ఆదాయ పన్ను 5,135.90

కస్టమ్స్‌ ట్యాక్స్‌ 1,419.41

ఎక్సైజ్‌ డ్యూటీ 1,075.28

మొత్తం 19,718.75

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu