శ్రీ మహాగణపతి ఆలయంలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు.. నిజామాబాద్‌లో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్సీ
జామాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే తలమానికంగా నిలుపుతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. నిజామాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధిలో..
నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే తలమానికంగా నిలుపుతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. నిజామాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఐటి హబ్, మినీ ట్యాంక్ బండ్, నూతన కలెక్టరేట్ మురుగు నీటి శుద్ధి ప్లాంట్ పనులను ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రానున్న రెండు నెలల్లో నిజామాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతుందన్నారు. పనులు సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా కు అభినందనలు తెలిపారు. అనంతరం మహాగణపతి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
నిజామాబాద్ లో గల ప్రతిష్టాత్మక శ్రీ మహాగణపతి దేవాలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కవిత వెంట ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, స్థానిక నాయకులు ఆయలాన్ని దర్శించుకున్నారు.
క్షమాణలు కోరిన పరకాల ఎమ్మెల్యే.. రిజర్వేషన్లపై తన వ్యాఖ్యలు వక్రీకరించారన్న చల్లా ధర్మారెడ్డి