గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన శాసన మండలి చైర్మన్‌.. మండలి ప్రాంగణంలో మొక్కలు నాటిన గుత్తా సుఖేందర్‌రెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంబించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అప్రతిహాతంగా సాగుతుంది. రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన శాసన మండలి చైర్మన్‌.. మండలి ప్రాంగణంలో మొక్కలు నాటిన గుత్తా సుఖేందర్‌రెడ్డి
Follow us
K Sammaiah

|

Updated on: Feb 02, 2021 | 3:58 PM

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంబించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అప్రతిహాతంగా సాగుతుంది. రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలు కార్యక్రమంలో పాల్గొని తమ వంతుగా మొక్కలు నాటుతున్నారు. ఇందులో భాగంగా శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.

శాసన మండలి ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి కార్యక్రమం రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో కొనసాగుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌ కార్యర్తలు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.