చల్లా ధర్మారెడ్డి క్షమాపణలు చెప్పినా వదలం.. వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్న రాములు నాయక్‌

K Sammaiah

K Sammaiah |

Updated on: Feb 02, 2021 | 4:27 PM

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రిజర్వేషన్ల పేరుతో అధికారులను కించపరచడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని మాజీ ఎమ్మెల్సీ..

చల్లా ధర్మారెడ్డి క్షమాపణలు చెప్పినా వదలం.. వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్న రాములు నాయక్‌

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రిజర్వేషన్ల పేరుతో అధికారులను కించపరచడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ చెప్పారు. ధర్మారెడ్డి క్షమాపణ చెప్పినా వదిలేది లెదని అన్నారు. ఓక దళితుడు రాసిన రాజ్యాంగం వల్ల దేశం మొత్తం నడుస్తుందని విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.

దళితుల ఓట్లతో గెలిచిన ధర్మారెడ్డి.. రిజర్వేషన్లను విమర్శించడం ఆయన నీచిపు బుద్దికి నిదర్శంనం అన్నారు. దళితులు మట్టిలో ఆణిముత్యాలన్న విషయం ధర్మారెడ్డి వంటి నేతలు గ్రహించాలన్నారు. దళితుల్లో ఐఏఎస్ , Ips ఆఫీసర్స్ ఉన్నారు. ధర్మారెడ్డి మాటలు కేసీఆర్‌, కేటీఆర్‌ మాట్లాడినట్లే భావించాల్సి వస్తుందని అన్నారు.

కేసీఆర్, కేటీఆర్ డైరెక్షన్‌లో చల్లా ధర్మారెడ్డి అలా మాట్లాడి ఉంటారని రాములు నాయక్‌ ఆరోపించారు. ధర్మారెడ్డి ని ఎమ్మెల్యే పదవిని నుండి వెంటనే బర్తరప్ చెయాలని డిమాండ్‌ చేశారు. అధికారులకు అండగా రాముల నాయక్ ఉన్నాడన్న విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. చల్లా ధర్మారెడ్డి ని హైదరాబాద్‌లో తిరగనివ్వమని హెచ్చరించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆరెఎస్‌కు ప్రజలు బుద్ధి చెపుతారని రాములు నాయక్‌ అన్నారు.

క్షమాణలు కోరిన పరకాల ఎమ్మెల్యే.. రిజర్వేషన్లపై తన వ్యాఖ్యలు వక్రీకరించారన్న చల్లా ధర్మారెడ్డి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu