Telangana: పార్ట్‌ టైం జాబ్స్‌.. అని కనపడితే చాలు!! క్లిక్‌ చేసి వెంటనే అప్లై చేస్తున్నారా..? జర భద్రం..!

పార్ట్‌ టైం జాబ్స్‌.. అని కనపడితే చాలు!! క్లిక్‌ చేసి వెంటనే అప్లై చేస్తున్నారా..? ఉద్యోగం కూడా వచ్చిందని సంబరపడిపోతున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త. మీరు నిండా మునిగినట్టే!! మీరు చేస్తుంది పార్ట్‌ టైం జాబ్‌ కాదు..! మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నట్టు! పార్ట్ టైం జాబ్స్‌ పేరుతో కోట్లు కొల్లగొట్టిన ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. 40కి పైగా కేసుల్లో నాలుగున్నర కోట్లు కొల్లగొట్టిందో ముఠా.

Telangana: పార్ట్‌ టైం జాబ్స్‌.. అని కనపడితే చాలు!! క్లిక్‌ చేసి వెంటనే అప్లై చేస్తున్నారా..? జర భద్రం..!
Cyber Crime
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Balaraju Goud

Updated on: Mar 02, 2024 | 1:03 PM

పార్ట్‌ టైం జాబ్స్‌.. అని కనపడితే చాలు!! క్లిక్‌ చేసి వెంటనే అప్లై చేస్తున్నారా..? ఉద్యోగం కూడా వచ్చిందని సంబరపడిపోతున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త. మీరు నిండా మునిగినట్టే!! మీరు చేస్తుంది పార్ట్‌ టైం జాబ్‌ కాదు..! మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నట్టు! పార్ట్ టైం జాబ్స్‌ పేరుతో కోట్లు కొల్లగొట్టిన ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. 40కి పైగా కేసుల్లో నాలుగున్నర కోట్లు కొల్లగొట్టిందో ముఠా.

సరైన క్వాలిఫికేషన్‌ ఉన్నా, ఉద్యోగాలు దొరకడం కొంత కష్టతరంగానే ఉంది. పలు కారణాలతో గ్యాప్‌ రావడమో.. ఆర్థిక అవసరాల కోసం ఉద్యోగం చేయాలన్న ఆశతోనో.. ఎలాగో ఖాళీ ఉంటున్నాం కదా గ్యాప్‌ లో ఏదైనా జాబ్‌ చేద్దామని చాలా మంది పార్ట్‌ టైం జాబ్‌ల కోసం వెతుకున్నారు. సోషల్‌ మీడియిలో పార్ట్‌ టైం జాబ్‌ల పేరుతో ప్రకటనలు కనిపిస్తే చాలు, ఏమాత్రం ఆలోచించకుండా వివరాలన్నీ ఇచ్చేస్తున్న వాళ్లున్నారు.

ఇలాంటి అమాయకులనే టార్గెట్ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. పార్ట్‌ టైం జాబ్స్‌ పేరుతో నమ్మించి, ఉద్యోగాలు ఇచ్చినట్లుగా చేర్చుకుని.. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. నిలువునా ముంచుతున్నాయి కొన్ని ముఠాలు. అలాంటి ఓ నకిలీ కన్సల్టెన్సీ ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు.

గుజరాత్‌ కి చెందిన అబ్దుల్లా ఫరూఖ్‌ జున్‌జునియా, ముంబై కి చెందిన మహమ్మద్‌ షోయబ్‌ బబ్లూ ఖాన్‌ ముఠాగా ఏర్పడ్డారు. 19 ఏళ్ల ఫరూఖ్‌ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుండగా, 27 ఏళ్ల షోయబ్‌ సివిల్‌ కాంట్రాక్టర్‌గా చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి మోసాలకు పాల్పడాలని ఫ్లాన్ చేసుకున్నారు. పార్ట్‌ టైం ఉద్యోగాల పేరుతో అమాయకులను టార్గెట్‌ చేసి దండుకోవడం మొదలుపెట్టారు.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియాతోపాటు పార్ట్‌ టైం ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న జాబ్‌ సీకర్స్‌ ని టార్గెట్‌ చేశారు. వర్క్‌ ఫ్రం హోమ్‌, పార్ట్‌ టైం జాబ్స్‌ ఇస్తామని నమ్మించారు. ముందుగా రిజిస్టర్‌ చేసుకోగానే, వాళ్ల అకౌంట్లలోకి బోనస్‌గా 500 రూపాయలను క్రెడిట్‌ చేశారు. ఇది ఒరిజినల్‌ కంపెనీ అన్నట్టుగా జాబ్‌ సీకర్స్‌ను నమ్మించారు.

ఉద్యోగం కావాలంటే, కొంత డబ్బును పెట్టుబడిగా పెట్టాలని, మీకు ఉద్యోగంతోపాటు అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. మీకు పంపిన టాస్క్‌లను పూర్తి చేయాలని, వీటి ద్వారా కూడా సాలరీ రూపంలో డబ్బులు వస్తాయని, పెట్టిన పెట్టుబడికి అదనంగా కూడా డబ్బులు వస్తాయని నమ్మించారు. దీంతో వందలాది మంది ఈ కేటుగాళ్లను నమ్మి ఒక్కొకరు వేలు, లక్షల రూపాయలు ఇన్వెస్ట్‌ చేశారు.

ఎంత డబ్బు ఇన్వెస్ట్‌ చేసినా సాలరీ లేదు.. ప్రాఫిట్స్‌ లేవని గ్రహించిన బాధితులు ఫరూఖ్‌, షోయబ్‌లను ప్రశ్నించారు. మరికొంత డబ్బు ఇన్వెస్ట్ చేయాలని, మొత్తం కలిపి ప్రాఫిట్‌ కూడా జతచేసి పంపుతామని చెప్పారు. మళ్లీ డబ్బులన కాజేశారు. అలా పలు దఫాలో ఏవో మాయమాటలు చెప్తూ డబ్బులు పెట్టుబడులుగా పెట్టింయుకుంటూపోయారు. బాధితులు కూడా తమ డబ్బులు తిరిగి వస్తాయన్న ఆశతో… వేలు, లక్షలు ఇన్వెస్ట్‌ చేస్తూనే వచ్చారు.

వారి చేతిలో మోసపోయిన హైదరాబాద్‌కి చెందిన ఓ బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన సీసీఎస్‌ టీం.. ముఠా నెట్‌వర్క్‌‌ను ట్రేజ్‌ చేసి పట్టుకుంది. ఫరూఖ్‌, షోయబ్‌లను పట్టుకున్న పోలీసులు ఖంగుతిన్నారు. వీళ్ల వద్ద కుప్పలుతెప్పలుగా బ్యాంక్‌ పాస్‌బుక్‌లు, చెక్‌ బుక్‌లు, డెబిట్‌ కార్డులుచ రబ్బరు స్టాంపులు, సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

ఫరూఖ్‌ నుంచి పలు బ్యాంకులకు చెందిన చెక్‌ బుక్‌లు, 83 డెబిట్‌ కార్డులు, వివిధ నెట్‌వర్క్‌లకు చెందిన 17 సిమ్‌ కార్డులు, 9 మొబైల్‌ ఫోన్స్‌ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. షోయబ్‌ నుంచి 5 లక్షల క్యాష్‌, 37 చెక్‌ బుక్‌లు, 11 పాస్‌ బుక్‌లు, పలు కంపెనీల పేర్లతో రబ్బర్‌ స్టాంప్‌లు, 12 సిమ్‌కార్డులు, 3 మొబైల్‌ ఫోన్స్‌, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు.

పార్ట్‌ టైం ఉద్యోగాలు, వర్క్‌ ఫ్రం హోమ్‌ ఉద్యోగాలు వంటి ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా డబ్బులు కడితే ఉద్యోగాలు ఇప్పిస్తామని, పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆఫర్‌ చేసే ప్రకటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?