Hyderabad: ఓరి వీళ్లు పాడగాను.. కార్లో వచ్చి గ్యాస్ బండ కొట్టేశారు.. వీడియో

కక్కుర్తి గాళ్లు.. మాయగాళ్లు సొసైటీలో పెరిగిపోతున్నారు. ఎంత ధనం ఉంటే ఏంది కానీ గుణం గొప్పది అయి ఉండాలి. ఇంకా చెప్పాలంటే రోజూ కూలి పని చేసుకునే వాళ్లు బెటర్. చేసిన కష్టంతో కడుపు నింపుకుంటారు. పరాయి సొమ్ము కోసం ఆశపడరు. ఈ వెదవలు చూడండి.. రిచ్చుగా కారులో వచ్చి మెయిర్ రోడ్డుపై ఆగి ఉన్న ట్రాలీ నుంచి గ్యాస్ బండ దొంగిలించారు.

Hyderabad: ఓరి వీళ్లు పాడగాను.. కార్లో వచ్చి గ్యాస్ బండ కొట్టేశారు.. వీడియో

|

Updated on: Mar 02, 2024 | 12:50 PM

కక్కుర్తి గాళ్లు.. మాయగాళ్లు సొసైటీలో పెరిగిపోతున్నారు. ఎంత ధనం ఉంటే ఏంది కానీ గుణం గొప్పది అయి ఉండాలి. ఇంకా చెప్పాలంటే రోజూ కూలి పని చేసుకునే వాళ్లు బెటర్. చేసిన కష్టంతో కడుపు నింపుకుంటారు. పరాయి సొమ్ము కోసం ఆశపడరు. ఈ వెదవలు చూడండి.. రిచ్చుగా కారులో వచ్చి మెయిర్ రోడ్డుపై ఆగి ఉన్న ట్రాలీ నుంచి గ్యాస్ బండ దొంగిలించారు.

వివరాల్లోకి వెళ్తే..  హైదరాబాద్ మాదన్నపేటలోని భార్గవి గ్యాస్ ఏజెన్సీకి చెందిన ట్రాలీ గ్యాస్ బండలు డెలివరీ ఇచ్చేందుకు బయల్దేరింది. ఈ క్రమంలో సైదాబాద్ మెయిన్ రోడ్డు పక్కన ఆపి.. ఎంప్లాయి సిలిండర్ ఇచ్చేందుకు లోనికి వెళ్ళాడు.  సరిగ్గా అదే సమయంలో ఇది గమనించిన యువకులు ఇద్దరు ట్రాలీ వెనక కారు ఆపారు. అక్కడే కాసేపు తచ్చాడి..  ట్రాలీ దగ్గర ఎవరూ లేరని నిర్దారణ చేసుకొని..  సిలిండర్ తీసుకుని కారులో పారిపోయారు. ఈ దృష్యాలన్నీ సీసీ పుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ఫిర్యాదు అందడంతో.. గ్యాస్ బండ దొంగల కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

Follow us