AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి వద్దకే భద్రాద్రి రాములోరి కళ్యాణ తలంబ్రాలు.. నేటి నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభం

భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాల ఆన్‌లైన్‌ బుకింగ్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ బుధవారం (మార్చి 15) ప్రారంభించారు. హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను..

ఇంటి వద్దకే భద్రాద్రి రాములోరి కళ్యాణ తలంబ్రాలు.. నేటి నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభం
Bhadrachalam Kalyanam Talambralu Online Booking
Srilakshmi C
|

Updated on: Mar 15, 2023 | 6:42 PM

Share

భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాల ఆన్‌లైన్‌ బుకింగ్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ బుధవారం (మార్చి 15) ప్రారంభించారు. హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ ఆవిష్కరించారు. అనంతరం బిజినెస్‌ హెడ్‌ (లాజిస్టిక్స్‌) పి సంతోష్‌ కుమార్‌కు రూ.116 చెల్లించి తొలి బుకింగ్‌ చేసుకుని తలంబ్రాల బుకింగ్‌ను ప్రారంభించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ ఏడాది కూడా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు సన్నద్దమవుతోంది. తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కార్గో పార్శిల్‌ కేంద్రాల్లో రూ.116 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్‌ఆర్టీసీ హోం డెలివరీ చేయనుంది.

ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌ మాట్లాడుతూ.. ‘భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఆ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని గత ఏడాది టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. తమ సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్‌ చేసుకున్నారు. గత ఏడాది దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను అందజేశాం. తద్వారా రూ.71 లక్షల రాబడి వచ్చింది. గత ఏడాది డిమాండ్‌ దృష్ట్యా ఈ శ్రీరామ నవమికి భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలను కోరుకునే భక్తులకు అందజేయబోతున్నాం. ఈ సారి రాములోరి కల్యాణంతో పాటు 12 ఏళ్లకో సారి నిర్వహించే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. భద్రాద్రిలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు. రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ కార్గో పార్శిల్‌ కౌంటర్లలో తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చన్నారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగ ఫోన్‌ నంబర్లు 9177683134, 7382924900, 9154680020ను సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.