AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: మోడీని పంపితే మరొక ఆస్కార్‌ వచ్చేది.. ఈడీ, బోడి.. ఎవరికీ భయపడేది లే: మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ, ప్రధానమంత్రి మోడీ టార్గెట్‌గా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణకు పట్టిన శని, దరిద్రం బీజేపీ అని ఆరోపించారు. మోడీ, ఈడీ, బోడీకి ఎవరికీ భయపడేది లేదన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సవాల్ విసిరారు.

Minister KTR: మోడీని పంపితే మరొక ఆస్కార్‌ వచ్చేది.. ఈడీ, బోడి.. ఎవరికీ భయపడేది లే: మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
Minister Ktr, Pm Modi
Basha Shek
|

Updated on: Mar 15, 2023 | 5:05 PM

Share

బీజేపీ, ప్రధానమంత్రి మోడీ టార్గెట్‌గా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణకు పట్టిన శని, దరిద్రం బీజేపీ అని ఆరోపించారు. మోడీ, ఈడీ, బోడీకి ఎవరికీ భయపడేది లేదన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సవాల్ విసిరారు.తాము ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఎవరు తప్పు చేశారో 2023లో ప్రజలే తీర్పు చెబుతారని సవాల్‌ విసిరారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట‌కు ఆస్కార్ అవార్డు వ‌చ్చింది. అయితే మన దేశంలో మోడీ అనే మహానటుడున్నారు. ఆయన్ను పంపితే మనకు మరో ఆస్కార్‌ వచ్చేది. మోడీలో అద్భుత‌మైన మ‌హాన‌టుడు ఉన్నారు. 2014లో ఎన్నో మాయ‌మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చారు. దేశం మొత్తం సంప‌ద దోచి వాళ్ల దోస్తుల ఖాతాలో వేస్తున్నారు. వారి దగ్గర చందా తీసుకోని ప్రతిపక్ష పార్టీల మీద ప‌డుతున్నారు. పార్టీల‌ను చీల్చి దేశాన్ని ఆగం చేయాల‌ని చూస్తున్నారు. ఆయ‌న‌ను మ‌హాన‌టుడు అని ఉట్టిగానే అన‌లేదు. ఇక ఆదాయం డ‌బుల్ చేస్తానన్నారు. కానీ రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. న‌ల్లధనం తెస్తాన‌ని చెప్పారు. ఇదే అడిగితే తెల్ల మోహం వేస్తున్నారు’ అని మోడీపై సెటైర్లు వేశారు కేటీఆర్‌.

ఇదే సభలో కాంగ్రెస్‌పై కూడా ధ్వజమెత్తారు కేటీఆర్‌. ’50 ఏళ్లు అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేయలేదు. మళ్లీ ఇప్పుడు పాదయాత్రలు చేసి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. నిన్న మొన్నటి దాకా మ‌నల్ని చావగొట్టింది కాంగ్రెసోళ్లే. అస‌లు వారికి ఎందుకు ఇవ్వాలి ఛాన్స్‌లు. కాంగ్రెస్, బీజేపీ నాయ‌కుల మోస‌పూరిత మాట‌ల‌కు మోసపోవ‌ద్దు’ అని జుక్కల్‌ నియోజ‌క‌వ‌ర్గ ప్రజలకు సూచించారు కేటీఆర్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..