Telangana Exams: తెలంగాణ లాసెట్, ఎడ్‌సెట్-2023 దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే
తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. లా కోర్సులో ప్రవేశాలకు తెలంగాణ లాసెట్-2023కు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆలస్య రుసుం లేకుండా లాసెట్‌కు ఏప్రిల్ 29 వరకు పెంపొందిస్తూ లాసెట్ కన్వినర్ ప్రకటించారు..

తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. లా కోర్సులో ప్రవేశాలకు తెలంగాణ లాసెట్-2023కు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆలస్య రుసుం లేకుండా లాసెట్‌కు ఏప్రిల్ 29 వరకు పెంపొందిస్తూ లాసెట్ కన్వినర్ ప్రకటించారు. ఏప్రిల్ 20 వరకు లాసెట్‌కు 35,072మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్ధులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా దరఖాస్తు చేసుకోవల్సిందిగా సూచించారు.
అలాగే ఎడ్‌సెట్‌కు దరఖాస్తు గడువును ఏప్రిల్ 25 వరకు పొడిగించారు. ఏప్రిల్ 20 నాటికి ఎడ్‌సెట్‌కు 21,456 మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు తమకు దగ్గరలోని కేంద్రంలో పరీక్ష రాయాలనుకుంటే త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఎడ్‌సెట్ కన్వినర్ సూచించారు. ఎడ్ సెట్ పరీక మే 18వ తేదీన, లా సెట్ మే20, 25 తేదీల్లో జరనున్నాయి.




మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
