Viral Video: ‘ఏంటో.. బొత్తిగా టేస్ట్ కరువైపోయింది వీళ్లకి! మగాళ్లు స్కర్టులు ధరించడమేంటో..’ ఫైర్ అవుతోన్న నెటిజన్లు
మండే ఎండలతో జనానాలు నానాపాట్లు పడుతున్నారు. కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణం చేయలేక ప్రయాణికులకు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. మరికొందరేమో ఇదే అదనుగా రీల్ మేకింగ్‌కు సృజనాత్మకతను జోడించి అందరి ఆగ్రహానికి గురవుతున్నారు. ఆ మధ్య ఓ యువతి ఢిల్లీ మెట్రోలో డ్యాన్స్..
మండే ఎండలతో జనానాలు నానాపాట్లు పడుతున్నారు. కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణం చేయలేక ప్రయాణికులకు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. మరికొందరేమో ఇదే అదనుగా రీల్ మేకింగ్‌కు సృజనాత్మకతను జోడించి అందరి ఆగ్రహానికి గురవుతున్నారు. ఆ మధ్య ఓ యువతి ఢిల్లీ మెట్రోలో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు మండిపడ్డారు. తాజాగా ఇద్దరు కుర్రాళ్లు డెనిమ్ స్కర్ట్స్ ధరించి మెట్రో ఎక్కారు. అంతే.. అందరిక కళ్లు వారిమీదే. వీళ్ల దుంపలు తెగ.. ఇదేం పోయేకాలం అంటూ తిట్టిపోస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
సాధారణంగా వేసవిలో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి కాస్త అనువైన దుస్తులు ధరిస్తుంటారు. ఆడవాళ్లు లూజుగా ఉండే పైజామా, కాటన్ దుస్తులు ధరించానికి ఇష్టపడితే.. మగవాళ్లేమో ఖద్దర్ చొక్కా లుంగీ లేదా పంచె ధరించి కంఫర్ట్‌బుల్‌గా ఫీలవుతుంటారు. ఐతే తాజాగా ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఇద్దరు కుర్రాల్లు పొడవాటి డెనిమ్ స్కర్ట్స్ ధరించి మెట్రో ఎక్కారు. అక్కడ వాళ్లు అటూ ఇటూ తిరుగుతూ రీల్స్ చేస్తున్నారు. ఇక ప్రయాణికులేమో వారిని వింతగా చూడటం మొదలు పెట్టారు. ఎవరేమనుకుంటే మాకేం అన్నట్లు వాళ్లిద్దరూ ఏమీపట్టనట్టు వీడియోలకు ఫోజు లిస్తూ హల్‌చల్ చేశారు. ఇందుకు సంబందించిన వీడియోను భవ్యకుమార్, సమీర్ ఖాన్ అనే యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. కేవలం గంటల వ్యవధిలోనే ఈ వీడియోకు లక్షల్లో వీక్షణలు, లైకులు రావడంతో వైరల్ అయ్యింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
View this post on Instagram
ఇది ‘మెట్రో.. మీ ఇల్లు కాదు. ఇలాంటి పిచ్చి వేశాలు వేయడం ఇకనైనా ఆపండి. ఇలా స్కర్టులు ధరించి మీ తల్లిదండ్రుల ముందుకు, ఊర్లకు వెళ్లండి. ఖచ్చితంగా పిచ్చికుక్కలు వెంటబడతాయ్’, ‘బికినీ ధరిస్తే ఇంకా కంఫర్టబుల్‌గా ఉంటుంది’ అని నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో మండిపడుతున్నారు. మరికొందరేమో నవ్వుతున్న ఎమోజీలతో స్పందించారు. అనుకుంటాం గానీ.. ఎవరి పిచ్చి వారికి ఆనందమని ఊరికే అనలేదు. వైరల్ అవ్వాలనే క్రేజ్‌తో యువత పడేపాట్లు పెద్దలకు కంపరం పుట్టిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.