Telangana: నల్ల కోడి, నిమ్మకాయలు, మట్టి బొమ్మ.. చెరువు పక్క వాగులో భయానక దృశ్యం.

మనిషి శాస్త్రసాంకేతికంగా ఎంతో ఎత్తు ఎదిగాడు. అంతరిక్షాన్ని అవలీలగా చేరుకుంటున్నాడు. ఇతర గ్రహాలపై ఇళ్లను కూడా కట్టుకుందామని ప్లాన్‌ చేస్తున్నాడు. అయితే కొందరి ఆలోచనలు మాత్రం ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉంటున్నాయి. మూఢా నమ్మకాలతో ఇంకా క్షుద్ర పూజలంటూ వెంపర్లాడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ అనాగరిక..

Telangana: నల్ల కోడి, నిమ్మకాయలు, మట్టి బొమ్మ.. చెరువు పక్క వాగులో భయానక దృశ్యం.
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 21, 2023 | 4:18 PM

మనిషి శాస్త్రసాంకేతికంగా ఎంతో ఎత్తు ఎదిగాడు. అంతరిక్షాన్ని అవలీలగా చేరుకుంటున్నాడు. ఇతర గ్రహాలపై ఇళ్లను కూడా కట్టుకుందామని ప్లాన్‌ చేస్తున్నాడు. అయితే కొందరి ఆలోచనలు మాత్రం ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉంటున్నాయి. మూఢా నమ్మకాలతో ఇంకా క్షుద్ర పూజలంటూ వెంపర్లాడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ అనాగరిక చర్య తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం రూఫ్కాన్‌ పేట గ్రామంలో గురువారం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. రూఫ్కాన్ పేట గ్రామంలోని చెరువు పక్కన ఉన్న వాగులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పూజలు నిర్వహించారు. ఘటన స్థలాన్ని ఉదయం చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సంఘటన జరిగిన ప్రాంతంలో బలి ఇచ్చిన నల్ల కోడి, నిమ్మకాయలు, పసుపు కుంకుమ, గుమ్మడి కాయలు ఉండడంతో అందరూ భయాందోళన చెందారు.

Black Magic

ఇవి కూడా చదవండి

అంతే కాకుండా చిన్న కుండలకు దారాలు కట్టి మధ్యలో మట్టి బొమ్మను ఉంచి పూజలు నిర్వహించినట్లు అర్థమవుతోంది. దీంతో ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని గ్రామస్థులకు ధైర్యం చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..