TS gurukulam Jobs 2023: తెలంగాణ గురుకులాల్లో 2,008 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలు.. ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తులు

తెలంగాణ సాంఘిక సంక్షేమం గురుకుల విద్యా సంస్థల్లో.. డైరెక్ట్‌ ప్రాతిపదికన 2,008 జూనియర్‌ లెక్చరర్‌, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ- రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్..

TS gurukulam Jobs 2023: తెలంగాణ గురుకులాల్లో 2,008 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలు.. ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తులు
TS gurukulam Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 21, 2023 | 3:52 PM

తెలంగాణ సాంఘిక సంక్షేమం గురుకుల విద్యా సంస్థల్లోని జూనియర్ కళాశాలల్లో.. డైరెక్ట్‌ ప్రాతిపదికన 2,008 జూనియర్‌ లెక్చరర్‌, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ- రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్‌, కామర్స్‌ తదితర సబ్జెక్టుల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆయా పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీపీఈడీ, బీపీఈ, ఎంపీఈడీ, ఎంఎల్‌ఐఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2023వ తేదీనాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన నిరుద్యోగులు మే 17, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరి అభ్యర్ధులు రూ.1200, ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులు/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.600లు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్షలు(పేపర్-1, 2, 3), డెమాన్‌స్ట్రేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.54,220ల నుంచి రూ.1,33,630ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • ఫిజికల్ డైరెక్టర్: 34 పోస్టులు
  • లైబ్రేరియన్: 50 పోస్టులు

జేఎల్‌ సబ్జెక్టు వారీగా ఖాళీలు..

  • తెలుగు సబ్జెక్టు పోస్టులు: 225
  • హిందీ సబ్జెక్టు పోస్టులు: 20
  • ఉర్దూ సబ్జెక్టు పోస్టులు: 50
  • ఇంగ్లిష్ సబ్జెక్టు పోస్టులు: 230
  • మ్యాథ్స్‌ సబ్జెక్టు పోస్టులు: 324
  • ఫిజిక్స్ సబ్జెక్టు పోస్టులు: 205
  • కెమిస్ట్రీ సబ్జెక్టు పోస్టులు: 207
  • బోటనీ సబ్జెక్టు పోస్టులు: 204
  • జువాలజీ సబ్జెక్టు పోస్టులు: 199
  • హిస్టరీ సబ్జెక్టు పోస్టులు: 7
  • ఎకనామిక్స్ సబ్జెక్టు పోస్టులు: 82
  • కామర్స్‌ సబ్జెక్టు పోస్టులు: 87
  • సివిక్స్‌ సబ్జెక్టు పోస్టులు: 84

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!