AP Anganwadi Jobs: అంగన్‌వాడీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయండి: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమశాఖలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ అధికారులతో గురువారం (ఏప్రిల్ 20) ఆయన సమీక్ష..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమశాఖలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ అధికారులతో గురువారం (ఏప్రిల్ 20) ఆయన సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీలలో నాడు-నేడు పనుల ప్రగతిపై సీఎం జగన్ అధికారులను ప్రశ్నించారు. ఫౌండేషన్ స్కూళ్లలో భాగంగా మారిన సుమారు 10వేలకుపైగా అంగన్‌వాడీల్లో పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. మిగిలిన సుమారు 45వేల అంగన్‌వాడీలలోనూ ప్రాధాన్యత క్రమంలో పనులు సకాలంలో పూర్తి చేయాలని సీఎం సూచించారు.
పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే గ్రోత్ మానిటరింగ్ ఎక్విప్‌మెంట్‌ను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. సంపూర్ణ పోషణ కింద పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన ఎస్‌ఓపీ రూపొందించాలని అన్నారు. పింఛన్లు తరహాలోనే సంపూర్ణ పోషణ పంపిణీలో ఎటువంటి రాజీ పడకూడదని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అంగన్‌వాడీ సెంటర్లను పరిశీలిస్తూ, అక్కడి పరిస్థితులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రతి అంగన్‌వాడీల్లో సూపర్ వైజర్లపైన పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.