TS Gurukulam Jobs 2023: తెలంగాణ గురుకులాల్లో 868 డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇవే..
తెలంగాణ సాంఘిక సంక్షేమం గురుకుల విద్యా సంస్థల్లోని డిగ్రీ కళాశాలల్లో.. డైరెక్ట్ ప్రాతిపదికన 868 డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ- రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్..
తెలంగాణ సాంఘిక సంక్షేమం గురుకుల విద్యా సంస్థల్లోని డిగ్రీ కళాశాలల్లో.. డైరెక్ట్ ప్రాతిపదికన 868 డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ- రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, జియాలజీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్, పొలిటికల్ సైన్స్, జర్నలిజం తదితర సబ్జెక్టుల్లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆయా పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్/స్లెట్/సెట్‌లో అర్హత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2023వ తేదీనాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు మే 17, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరి అభ్యర్ధులు రూ.1200, ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులు/ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్ధులు రూ.600లు రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.58,850ల నుంచి రూ.1,37,050ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు: 39 పోస్టులు
- లైబ్రేరియన్ పోస్టులు: 36 పోస్టులు
డిగ్రీ లెక్చరర్ సబ్జెక్టు వారీగా ఖాళీలు..
- తెలుగు సబ్జెక్టు పోస్టులు: 55
- ఇంగ్లిష్ సబ్జెక్టు పోస్టులు: 69
- మ్యాథ్స్ సబ్జెక్టు పోస్టులు: 62
- స్టాటిస్టిక్స్ సబ్జెక్టు పోస్టులు: 58
- ఫిజిక్స్ సబ్జెక్టు పోస్టులు: 46
- కెమిస్ట్రీ సబ్జెక్టు పోస్టులు: 69
- బోటనీ సబ్జెక్టు పోస్టులు: 38
- జువాలజీ సబ్జెక్టు పోస్టులు: 58
- కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు పోస్టులు: 99
- జియాలజీ సబ్జెక్టు పోస్టులు: 6
- బయో కెమిస్ట్రీ సబ్జెక్టు పోస్టులు: 3
- బయో టెక్నాలజీ సబ్జెక్టు పోస్టులు: 2
- హిస్టరీ సబ్జెక్టు పోస్టులు: 28
- ఎకనామిక్స్ సబ్జెక్టు పోస్టులు: 25
- పొలిటికల్ సైన్స్ సబ్జెక్టు పోస్టులు: 27
- కామర్స్ సబ్జెక్టు పోస్టులు: 93
- జర్నలిజం సబ్జెక్టు పోస్టులు: 2
- సైకాలజీ సబ్జెక్టు పోస్టులు: 6
- మైక్రోబయాలజీ సబ్జెక్టు పోస్టులు: 17
- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టు పోస్టులు: 9
- సోషియాలజీ సబ్జెక్టు పోస్టులు: 7
- బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టు పోస్టులు: 14
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.