YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. వివేకా మర్డర్ కేసును సీబీఐ దర్యాప్తు వేగవంతమైన క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది.

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే..
Ys Viveka Murder Case
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 21, 2023 | 1:12 PM

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. వివేకా మర్డర్ కేసును సీబీఐ దర్యాప్తు వేగవంతమైన క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. వివేకా కూతురు సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలో వైఎస్ సునీత, ఎంపీ అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాదుల మధ్య వాడీవేడి వాదనలు కొనసాగాయి. ఉత్తర్వులపై స్టే విధిస్తే అవినాశ్‌ను సీబీఐ అరెస్టు చేస్తుందని అవినాశ్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీనిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూనే, సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టే వరకు అరెస్టు చేయవద్దంటూ కొంత రిలీఫ్ ఇచ్చింది.

వైఎస్ వివేకానంద రెడ్డి రక్తపుమడుగులో పడి ఉంటే గుండెపోటుతో చనిపోయారని వైఎస్ అవినాశ్ రెడ్డి అన్నారని.. వైఎస్ సునీత తరుపు న్యాయవాదులు వివరించారు. సీబీఐ కేసు టేకప్ చేసినప్పుడు చాలా సమస్యలు ఎదురయ్యాయి.. చివరకు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేయాల్సి వచ్చింది. సీబీఐ స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశాక అవినాశ్ రెడ్డి తండ్రి సహా ఇద్దరు అరెస్ట్ అయ్యారు. అవినాశ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా ఒక మధ్యంతర ఉత్తర్వు ద్వారా రిలీఫ్ ఇచ్చిందన్నారు. ఇది చాలా అభ్యంతరకరంగా ఉంది.. దర్యాప్తు సమయంలో హత్యకు బహుళ కారణాలు, ఉద్దేశాలు ఉన్నాయని గుర్తించింది. అవినాశ్ రెడ్డిని ఎలా ప్రశ్నించాలో చెబుతూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాతపూర్వక ప్రశ్నలు ఉండాలని, వాటిని అవినాశ్ రెడ్డికి అందజేయాలని సూచించిందని వివరించారు.

ఇదిలాఉంటే.. హైకోర్టు ఆదేశాలతో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. వరుసగా మూడోరోజు ఎంపీ అవినాష్ రెడ్డి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకుని విచారణకు హాజరయ్యారు. సీబీఐ విచారణ కొనసాగుతున్న క్రమంలోనే సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..