Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulivendula: వివేకాలో కేసులో భారీ ట్విస్ట్.. తొలిసారిగా తెరపైకి రెండో భార్య.. ఆమె ఫస్ట్ స్టేట్మెంట్ ఇదే…

రెండు తెలుగు రాష్ట్రాల‌నే కాదు ఉలిక్కిప‌డేలా చేసిన 2019 నాటి.. వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌లో భారీ ట్విస్ట్ తెర‌మీదికి వ‌చ్చింది. ఇన్నాళ్లుగా ఎక్క‌డ ఉన్నారో.. ఏం చేస్తున్నారో కూడా తెలియ‌ని.. వివేకా రెండో భార్య‌ షేక్ షమీమ్‌ సడెన్‌గా తెరపైకి వచ్చారు. రావడమే కాదు సంచలన ఆరోపణలు కూడా చేశారు.

Pulivendula: వివేకాలో కేసులో భారీ ట్విస్ట్.. తొలిసారిగా తెరపైకి రెండో భార్య.. ఆమె ఫస్ట్ స్టేట్మెంట్ ఇదే...
YS Viveka With Second Wife
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 21, 2023 | 12:30 PM

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. ఆయన రెండో భార్య షేక్ షమీమ్‌పై చాలామంది ఫోకస్ పడింది. అసలు ఆమె వెర్షన్ ఏంటి..? ఆమెతో వివేకా ఎలాంటి విషయాలు పంచుకునేవారు..? మర్డర్ గురించి ఎవరిపై ఆమెకు అనుమానాలు ఉన్నాయి వంటి విషయాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె తొలిసారిగా ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనంగా మారింది.  వివేకాతో 2010 లో వివాహం అయ్యిందని.. 2011లో మరోసారి వివాహం చేసుకున్నట్లు షమీమ్‌ తెలిపారు. 2015లో తమకు షహన్షాన్ పుట్టినట్లు వివరించారు. వివేక హత్యకు కొన్ని గంటల ముందు కూడా తనతో  ఫోన్‌లో మాట్లాడినట్లు షమీమ్ తెలిపారు. తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని ఆమె తెలిపారు.  వివేకా బామ్మర్ది, అల్లుడి అన్న నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తనను, తన కుటుంబ సభ్యుల్ని ఎన్నోసార్లు బెదిరించారని ఆమె తెలిపారు.

వివేకాకు దూరంగా ఉండమని సునీతా రెడ్డి సైతం హెచ్చరించేదని షమీమ్ వెల్లడించారు. వివేకా ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్‌కు, వివేకా పదవిపై శివప్రకాశ్ రెడ్డికి కాంక్ష ఉండేదన్నారు. తమ కొడుకు షహన్షాన్ పేరు మీద 4 ఏకరాలు కొందామని వివేకా అనుకున్నా.. శివ ప్రకాష్ రెడ్డి ఆపేశాడని ఆమె వివరించారు. వివేకాను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారని.. అన్యాయంగా వివేకా చెక్ పవర్ తొలగించారని ఆమె ఆరోపించారు. చెక్ పవర్ తొలగించడంతో వివేకా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడని షమీమ్ తెలిపారు. బెంగుళూరు ల్యాండ్ సెటిల్మెంట్ ద్వారా 8 కోట్లు వస్తాయని వివేకా తనతో చెప్పాడని..  హత్యకు కొన్ని గంటల ముందు కూడా 8 కోట్లు గురించి ఆయన తనతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. చనిపోయిన తరువాత వివేకా ఇంటికి వెళ్దామనుకున్న.. శివ ప్రకాష్ రెడ్డి మీద భయంతో అటు వైపు వెళ్లలేకపోయానని షమీమ్ వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..