TS Congress: ‘పరిచయాలు ఉన్నంత మాత్రానే టికెట్లు రావు’.. టీపీసీసీ మీట్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు..

Manik Rao Thakre: గాంధీ భవన్ వేదికగా సోమవారం జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడిన ఠాక్రే పార్టీని నష్టపరిచే..

TS Congress: ‘పరిచయాలు ఉన్నంత మాత్రానే టికెట్లు రావు’.. టీపీసీసీ మీట్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు..
Manik Rao Thakre
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 23, 2023 | 9:02 AM

Manik Rao Thakre: గాంధీ భవన్ వేదికగా సోమవారం జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడిన ఠాక్రే పార్టీని నష్టపరిచే పనులు ఎవరు చేసినా యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు. పార్టీలో డిసిప్లెన్ ఉండాలి పొరపాటున కూడా పార్టీ డ్యామేజ్ అయ్యే పనులు ఎవరు చేయకూడదని సూచించారు. కర్ణాటకలో కష్టపడి గెలిచాం.. తెలంగాణలో కూడా గెలుస్తామంటూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాడు కానీ, బీజేపీతో ఫ్రెండ్లీగానే ఉన్నాడని ఠాక్రే వ్యాఖ్యానించారు.

కేసీఆర్, బీజేపీ తెరచాటు స్నేహాన్ని ప్రజలకి వివరించాలని, రాష్ట్రంలోని సమస్యలపై అన్ని స్థాయిల్లో పోరాట కార్యక్రమాలు జరగాలన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున, ఎన్నికలకు కాంగ్రెస్ నాయకులందరూ సిద్దంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. మీడియాలో మనల్ని ఇబ్బంది పెట్టే వార్తలు వస్తాయని, వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని సూచించారు.

ఇంకా ‘కాంగ్రెస్ పార్టీ పట్ల క్షేత్ర స్థాయిలోని ప్రజల్లో విశ్వాసం కల్పించాలి. పార్టీ పదవుల్లో ఉండి కూడా పని చేయని వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. బాధ్యత ఇచ్చిన తర్వాత కూడా పని చేయలేకపోతే…పని చేయలేమని చెప్పేయండి. బాధ్యతలను విస్మరిస్తే ఏ మాత్రం ఉపేక్షించేది లేదు. పార్టీ కోసం పని చేయని వారిని పక్కన పెట్టేద్దాం. కష్టపడ్డ వారికి మాత్రమే టికెట్లు వస్తాయి. సర్వేల ఆధారంగా టికెట్ల వస్తాయి. పార్టీలోని కీలక నాయకులతో పరిచయాలు ఉన్నంత మాత్రాన టికెట్లు రావు’ అంటూ  మాణిక్ రావ్ ఠాక్రే పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..