IPL 2023, Qualifier 1: ఈ సారైనా ధోని సేన గెలిచేనా..? తొలి క్వాలిఫైయర్‌లో చెన్నైతో తలపడబోతున్న గుజరాత్.. గెలిస్తే నేరుగా ఫైనల్‌కే..
GT vs CSK, Qualifier 1: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు అయిపోవడంతో మొత్తం 4 టీమ్‌లు ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌కు ఆర్హత సాధించాయి. క్వాలిఫై అయిన జట్లలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్,..
GT vs CSK, Qualifier 1: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు అయిపోవడంతో మొత్తం 4 టీమ్‌లు ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌కు ఆర్హత సాధించాయి. క్వాలిఫై అయిన జట్లలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ఉండగా.. మంగళవారం రాత్రి 7:30 గంటలకు చెన్నై వేదికగా మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఇక టోర్నీలోని తొలి మ్యాచ్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లే ఈ క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో కూడా తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. అలాగే ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు.. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో తలపడుతుంది. అందులో గెలిచిన జట్టు కూడా ఫైనల్స్‌కు చేరి, ఈ రోజు గెలిచిన టీమ్‌తో ఐపీఎల్ కప్ కోసం పోటీ పడుతుంది.
అయితే ఐపీఎల్ 15వ సీజన్(2022)లోనే ఆరంగేట్రం చేసి.. అదే సీజన్‌లో కప్ కొట్టిన గుజరాత్ టైటాన్స్ ధోని సేనపై ఆధిపత్యం కొనసాగిస్తుంది. ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడగా.. వాటిలో గుజరాత్ టీమ్ మొత్తం 3 మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. అంటే గుజరాత్ టైటాన్స్ మీద చెన్నై సూపర్ కింగ్స్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో అయిన గుజరాత్ టీమ్‌ని ధోని సేన మట్టికరిపిస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.
గుజరాత్ టైటాన్స్:
డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఈ టోర్నీ మొత్తం కూడా అద్భుతమైన ప్రదర్శనను కనబర్చింది. ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో 10 మ్యాచ్‌లు గెలిచి, నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అలాగే ఈ ఏడాది ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా కూడా నలిచింది. ఇక గుజరాత్ టీమ్ అయితే బ్యాటింగ్- బౌలింగ్ రెండు విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. వృద్దిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్‌లు టీమ్‌కి శుభారంభం అందించగలుగుతున్నారు. ఇక గిల్ అయితే ఈ టోర్నీలో 2 సెంచరీలతో సహా మొత్తం 680 పరుగులు చేశాడు. అలాగే కెప్టెన్ హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియాలతో మిడిల్ ఆర్డర్ చక్కగా ఉంది. పాండ్యాతో పాటు రషీద్ ఖాన్ కూడా ఆల్ రౌండర్‌గా కనిపిస్తున్నాడు. వీరితో పాటు మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్, నూర్ అహ్మద్ గుజరాత్ టీమ్ ప్రత్యర్థులకు ప్రాణాంతకంగా ఆడుతున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్:
గతేడాది లీగ్ దశలోనే వెనుదిరిగిన ధోని సేన కూడా ఈ ఏడాది అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఐపీఎల్ 16వ సీజన్ లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడిన చెన్నై 8 విజయాలతో ప్లేఆఫ్స్‌కి చేరుకుంది. గుజరాత్ టీమ్ లాగానే చెన్నై టీమ్ కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే అద్భుతమైన ఫామ్‌లో ఉండి జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. అనంతరం వచ్చే అజింక్య రహానే కూడా విధ్వంసకరంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. శివమ్ దూబే అయితే ప్రతి మ్యాచ్‌లో సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. అంబటి రాయుడు, మొయిన్ అలీ ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. కానీ ధోనీ, జడేజాలు ఫినిషింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బౌలింగ్ విభాగంలో కూడా జడేజా కీలక పాత్ర పోషిస్తుండగా తుషార్ దేశ్‌పాండే, మహిషా తీక్షన్, మతీషా పతిరానా, ఆకాశ్‌సింగ్ జడేజా, అలీ సాథ్ సీఎస్‌కేకి బౌలింగ్ సేవలు అందిస్తున్నారు.
ఇరుజట్ల ప్లేయింగ్ ఎలెవన్(అంచనా)
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, యశ్ దయాల్, విజయ్ శంకర్
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్& వికెట్ కీపర్ ), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ