CSK vs GT, Qualifier 1: రికార్డుల వేటలో పడిన చెన్నై, గుజరాత్ ఆటగాళ్లు.. లిస్టులో ధోని సహచరులే ఎక్కువ..

IPL 2023, Qualifier 1: ఐపీఎల్ 16వ సీజన్‌ లీగ్ దశ ముగిసి, టోర్నీ కీలక ఘట్టానికి చేరుకుంది. లీగ్ దశలో 70 మ్యాచ్‌లు జరగ్గా.. టాప్ 4 లో నిలిచిన నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ప్లే ఆఫ్‌కు చేరుకున్న 4 జట్లలో.. డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్..

CSK vs GT, Qualifier 1: రికార్డుల వేటలో పడిన చెన్నై, గుజరాత్ ఆటగాళ్లు.. లిస్టులో ధోని సహచరులే ఎక్కువ..
Csk Vs Gt,qualifier 1; Awaiting Records
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 23, 2023 | 9:55 AM

IPL 2023, Qualifier 1: ఐపీఎల్ 16వ సీజన్‌ లీగ్ దశ ముగిసి, టోర్నీ కీలక ఘట్టానికి చేరుకుంది. లీగ్ దశలో 70 మ్యాచ్‌లు జరగ్గా.. టాప్ 4 లో నిలిచిన నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ప్లే ఆఫ్‌కు చేరుకున్న 4 జట్లలో.. డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు టోర్నీ విజేత చెన్నై సూపర్ కింగ్స్, అత్యధిక సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ రోజు రాత్రి 7:30 గంటలకు చెన్నై వేదికగా జరిగే తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై-గుజరాత్ జట్లు తలపడబోతున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో కొందరు ప్లేయర్లు రికార్డులు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి వారెవరో ఇప్పుడే చూసేద్దాం..

రికార్డులు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్న ఆటగాళ్లు:

  1. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో 2 సిక్సర్లు బాదితే ఐపీఎల్‌లో 100 సిక్స్‌లను పూర్తి చేశాడు.
  2. అలాగే జడేజా మరో వికెట్ తీస్తే ఐపీఎల్‌లో 150 వికెట్ల పడగొట్టిన రికార్డు కూడా అందుకుంటాడు.
  3. టీ20 క్రికెట్‌లో 6000 పరుగులు పూర్తి చేసేందుకు చెన్నై బ్యాట్స్‌మ్యాన్ అంబటి రాయుడు 8 పరుగుల దూరంలో ఉన్నాడు.
  4. అంతేకాదు రాయుడు మరో 5 బౌండరీలు బాదితే టీ20 క్రికెట్‌లో 500 బౌండరీలను కూడా పూర్తి చేస్తాడు.
  5. ఇవి కూడా చదవండి
  6. చెన్నై ఆటగాడు అజింక్య రహానే కూడా టీ20 క్రికెట్‌లో 6000 పరుగులు పూర్తి చేసేందుకు 78 పరుగుల దూరంలో ఉన్నాడు.
  7. గుజరాత్ టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి తన జట్టుకు టైటిల్‌ అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే నేటి మ్యాచ్‌లో పాండ్యా మరో 2 వికెట్లు తీయగలిగితే.. తన టీ20 క్రికెట్ కెరీర్‌లో 150 వికెట్లు పడగొట్టిన ఘనత అందుకుంటాడు.
  8. గుజరాత్ టీమ్ తరఫున ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ మరో 41 పరుగులు చేస్తే టీ20 ఫార్మాట్‌లో 3500 పరుగులు పూర్తి చేసుకుంటాడు.
  9. ఇదే తరహాలో శుభ్‌మన్ గిల్ మరో 8 బౌండరీలు బాదితే టీ20 క్రికెట్‌లో 350 బౌండరీలు పూర్తి చేస్తాడు.
  10. ఇంకా గుజరాత్‌ టైటాన్స్ టీమ్‌లోని అల్జారీ జోసెఫ్ తన టీ20 క్రికెట్‌ కెరీర్‌లో 99 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో అతను మరో వికెట్ తీస్తే టీ20 వికెట్ల సెంచరీని నమోదు చేస్తాడు.

కాగా నేటి క్వాలిఫయర్-1  మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2023 ఫైనల్‌కు చేరుకుంటుంది. అలాగే ఓడిన జట్టుకు ఫైనల్‌ చేరుకోవడానికి మరో అవకాశం పొందుతుంది. ఎలా అంటే ఎలిమినేటర్ మ్యాచ్‌(లక్నో సూపర్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్) విజేతతో క్వాలిఫయర్-2  మ్యాచ్‌లో నేటి మ్యాచ్‌లో ఓడిన జట్టు తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..