Chris Gayle, IPL 2024: వచ్చే ఐపీఎల్ టోర్నీకి యూనివర్సల్ బాస్..! ‘రిటైర్‌మెంట్‌ని వెనక్కి తీసుకుంటున్నా.. కాచుకో కోహ్లీ’ అంటూ..
Chris Gayle & Virat Kohli: ఐపీఎల్ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న మాజీ ఆర్‌సీబీ ఆటగాడు క్రిస్ గేల్ తిరిగి ధనాధన్ లీగ్‌లోకి రాబోతున్నాడు. అవును, ఈ మాటలను యూనివర్సల్ బాస్ స్వయంగా చెప్పాడు. ఇందుకు కారణం కోహ్లీ చేసిన సెంచరీయే. అవును, గుజరాత్ టైటాన్స్‌పై..
Chris Gayle & Virat Kohli: ఐపీఎల్ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న మాజీ ఆర్‌సీబీ ఆటగాడు క్రిస్ గేల్ తిరిగి ధనాధన్ లీగ్‌లోకి రాబోతున్నాడు. అవును, ఈ మాటలను యూనివర్సల్ బాస్ స్వయంగా చెప్పాడు. ఇందుకు కారణం విరాట్ ‘కింగ్’ కోహ్లీ చేసిన సెంచరీయే. అవును, గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్ గెలిస్తేనే ఐపీఎల్ ప్లేఆఫ్స్ అన్న సమయంలో ఆర్‌సీబీ తరఫున విరాట్ కోహ్లీ సెంచరీతో విజృంభించాడు. ఆ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడినా.. కోహ్లీ పలు రికార్డులను సృష్టించాడు. హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్‌పై సంచరీ చేసిన కోహ్లీ.. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు.
అలా జరిగిన మూడు రోజులకే క్రిస్‌గేల్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు కోహ్లీ. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌కి ముందు క్రిస్‌గేల్, కింగ్ కోహ్లీ చెరో 6 సెంచరీలతో ఐపీఎల్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీల రికార్డును కలిగి ఉన్నారు. కానీ ఆ మ్యాచ్‌లో 61 బంతుల్లోనే అజేయమైన సెంచరీతో చెలరేగిన కోహ్లీ ఆ రికార్డును పూర్తిగా తన వశం చేసుకున్నాడు. దీంతో క్రిస్‌గేల్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టినట్లయింది. దీనిపై స్పందించిన యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్ ‘ఐపీఎల్‌లోకి తిరిగి వచ్చేస్తున్నా.. కాచుకో కోహ్లీ’ అన్నాడు.
అయితే ఈ మాటలను క్రిస్‌గేల్ సరదాగా అన్నాడు. ‘కోహ్లీ కాచుకో.. నేను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నా. వచ్చే ఏడాది నాతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉండు’ అంటూ గేల్ జోక్ చేశాడు. జీయో సినిమాతో క్రిస్ గేల్ మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. క్రిస్‌గేల్‌ని ఆర్‌సీబీ శిబిరంలో మరోసారి చూడాలని ఉండని ఆ టీమ్ ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు.