RCB vs GT: గుజరాత్ జెర్సీపై కింగ్ కోహ్లీ ఆటోగ్రాఫ్.. ఆకర్షణగా రషిద్ ఖాన్ వినయం.. వైరల్ అవుతున్న వీడియో..
Virat Kohli's Autograph: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం రషిద్ ఖాన్ చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా..
Virat Kohli’s Autograph: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం రషిద్ ఖాన్ చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో తన టీమ్ బౌలర్లపై సెంచరీతో విజృంభించిన విరాట్ కింగ్ కోహ్లీ ఆటోగ్రాఫ్‌నే తీసుకున్నాడు రషిద్. అవును, అది కూడా తన గుజరాత్ జెర్సీ మీద కావడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన గుర్తింపు పొందిన రషిద్.. విరాట్ కోహ్లీ నుంచి ఎంతో వినయంగా ఆటోగ్రాఫ్ తీసుకోవడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ టీమ్ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అది కాస్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఓటమిపాలైన ఆర్‌సీబీ ప్లేయర్లు.. తమ అభిమానుల అభిమానానికి అభివాదం చేస్తూ చిన్నస్వామి స్టేడియంలో తిరగాడడం కనిపిస్తుంది.
మరోవైపు ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించేందుకు కీలకమైన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోవడం వల్ల.. ఆ టీమ్ టోర్నీని లీగ్ దశలోనే ముగించింది. అలాగే ఆర్‌సీబీ ఓటమిపైనే ఆశలు పెట్టుకున్న ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. ఇక మ్యాచ్‌లో ఆర్‌సీబీ ప్లేయర్ కోహ్లీ(101, నాటౌట్)తో పాటు గుజరాత్ యంగ్ ఓపెనర్ శుభమాన్ గిల్(104, నాటౌట్) కూడా సెంచరీతో రాణించాడు.
కాగా, మంగళవారం రాత్రి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ధోని సేన మధ్య మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన టీమ్ నేరుగా ఫైనల్‌కి చేరుతుంది. అలాగే ఓడిన జట్టుకు మరో అవకాశం లభిస్తుంది. నేటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఓడిన జట్టు.. ఎలిమినేటర్ మ్యాచ్(లక్నో సూపర్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్) విజేతతో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు కూడా ఫైనల్స్‌కు చేరుకుంటుంది.