Dimple Hayathi: ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన డింపుల్ హయాతి.. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు..

టాలీవుడ్‌ నటి డింపుల్‌ హయతిపై హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపీఎస్‌ అధికారి రాహుల్‌ హెగ్డే కారుని పార్కింగ్‌ ప్లేస్‌లో డింపుల్‌ హయతి కాబోయే భర్త డేవిడ్‌ ఢీకొట్టాడు. అనంతరం డింపుల్ హయాతి ఐపీఎస్‌ కారును కాలుతో తన్నడం కలకలం రేపుతోంది.

Dimple Hayathi: ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన డింపుల్ హయాతి.. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు..
Dimple Hayathi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 23, 2023 | 11:52 AM

టాలీవుడ్‌ నటి డింపుల్‌ హయతిపై హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపీఎస్‌ అధికారి రాహుల్‌ హెగ్డే కారుని పార్కింగ్‌ ప్లేస్‌లో డింపుల్‌ హయతి కాబోయే భర్త డేవిడ్‌ ఢీకొట్టాడు. అనంతరం డింపుల్ హయాతి ఐపీఎస్‌ కారును కాలుతో తన్నడం కలకలం రేపుతోంది. డింపుల్‌ హయతి.. కిలాడీ.. రామబాణం లాంటి సినిమాల్లో నటి.. కానీ, రియల్‌ లైఫ్‌లో రెచ్చిపోవడం చర్చనీయాంశంగా మారింది. నటిని కదా సినిమాల్లోలా.. ఏం చేసినా చెల్లుతుందనుకుంది. ఏకంగా ఐపీఎస్‌ అధికారినే బెదిరించే స్థాయికి చేరడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. సినీ ఫక్కీలో హీరోయిజం చెలాయించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. పార్కింగ్‌ విషయంలో చెలరేగిన వివాదం ఇప్పుడు కేసుల వరకూ వెళ్ళిడం చర్చనీయాంశంగా మారింది.

అయితే, హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీలో నటి డింపుల్‌ హయతి, ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెగ్డే ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు.. పార్కింగ్‌ ప్లేస్‌లో ఉన్న రాహుల్‌ హెగ్డే వాహనాన్ని ఢీకొట్టి ప్రతాపం చూపించాడు డింపుల్‌ హయతి కాబోయే భర్త. ఆ తర్వాత వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. డింపుల్ తరచూ అతిగా ప్రవర్తిస్తున్నారని, ఎన్నిసార్లు సర్ధిచెప్పినా వినలేదని ఐపీఎస్‌ అధికారి ఫిర్యాదులో పేర్కొన్నారు.

డింపుల్‌ హయతి ఆగడాలపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు రాహుల్‌ హెగ్డే డ్రైవర్‌ చేతన్‌ కుమార్‌. 353, 341, 279 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఆస్తుల విధ్వంసం కేసుపెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం..

74 ఏళ్ల నాటి రూ. 100 నోటు.. ఎంతకు అమ్ముడైందో తెలిస్తే
74 ఏళ్ల నాటి రూ. 100 నోటు.. ఎంతకు అమ్ముడైందో తెలిస్తే
మనకి ఏం ఉంటే సంతోషంగా ఉంటామో.. అది ఈ సినిమా చెబుతుంది
మనకి ఏం ఉంటే సంతోషంగా ఉంటామో.. అది ఈ సినిమా చెబుతుంది
చేసినవి 24 సినిమాలు.. కానీ హిట్ నాలుగే.. ఈ హాట్ భామ ఎవరో తెల్సా
చేసినవి 24 సినిమాలు.. కానీ హిట్ నాలుగే.. ఈ హాట్ భామ ఎవరో తెల్సా
ప్రపంచంలో 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు.. భారత్ స్థానం ఏమంటే..?
ప్రపంచంలో 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు.. భారత్ స్థానం ఏమంటే..?
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి మోదీః చంద్రబాబు
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి మోదీః చంద్రబాబు
డెయిరీనుంచి వెలువడుతున్న కాలుష్యం కాపాడండి మహాప్రభో అంటూ నినాదాలు
డెయిరీనుంచి వెలువడుతున్న కాలుష్యం కాపాడండి మహాప్రభో అంటూ నినాదాలు
HMPV గురించి భయపడాల్సిన పని లేదు.. సాధారణ వైరస్ అంటున్న WHO
HMPV గురించి భయపడాల్సిన పని లేదు.. సాధారణ వైరస్ అంటున్న WHO
70 ఏళ్ల తర్వాత తెరుచుకున్న మహాదేవ ఆలయ తలుపులు..
70 ఏళ్ల తర్వాత తెరుచుకున్న మహాదేవ ఆలయ తలుపులు..
భారత్‌ను చెడుగా చూపించే సినిమాలనే ఆస్కార్ సెలెక్ట్ చేస్తుంది
భారత్‌ను చెడుగా చూపించే సినిమాలనే ఆస్కార్ సెలెక్ట్ చేస్తుంది
కుంభ రాశిలో రాహువు.. ఆ రాశుల వారికి విదేశీ ఉద్యోగ అవకాశాలు..
కుంభ రాశిలో రాహువు.. ఆ రాశుల వారికి విదేశీ ఉద్యోగ అవకాశాలు..