Telangana: ఏటూరునాగారం రిజర్వ్ ఫారెస్ట్‌లో హై టెన్షన్.. అటవీశాఖ అధికారులపైకి తిరగబడ్డ గిరిజనులు!
ములుగు జిల్లా ఏటూరునాగారం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా రణరంగంగా మారింది. అడవుల్లో గుడిసెలు వేసుకున్న ఆదివాసీలు అటవీ శాఖ సిబ్బంది పైకి కారం, కర్రలు, కొడవళ్ళతో తిరగ బడ్డారు. గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై శివమెత్తారు. ఆదివాసీలు, అటవీశాఖ సిబ్బంది మధ్య పోపులాటతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతుందంటె పోడు భూముల వద్ద గొడవలు, అటవీశాఖ అధికారులు పోడు రైతుల మధ్య ఘర్షణ వాతావరణం కామన్‌గా చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఏకంగా కొందరు గిరిజనులు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో నివాస గృహాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ నివాస గృహాలను తొలగించడం కోసం అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నం పచ్చటి అడవినిరణరంగంగా మార్చింది. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరు,చల్పాక గ్రామాల మధ్య రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో సుమారు 45 మంది ఆదివాసీలు నివాస గృహాలు ఏర్పాటు చేసుకున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో నివాసగృహాలు ఏర్పాటు చేసుకోవడం నేరమని సూచించిన అటవీశాఖ అధికారులు ఇప్పటికే పలు సందర్భాలలో వారికి నోటీసులు ఇచ్చారు. కాలీ చేసి వెళ్ళాలని ఆదేశించారు. కానీ ఇల్లు లేని తాము ఇక్కడే ఉంటామని గిరిజనులంతా భీష్ముంచుక కూర్చున్నారు. ఇక్కడి నుండి కదలాలంటే తమకు మరో మార్గం చూపాలని, ఇండ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.

ఎన్ని నోటీసులు వచ్చినా ఎన్నిసార్లు హెచ్చరించిన అక్కడినుండి వెళ్లకపోవడంతో సోమవారం ఉదయం అటవీశాఖ అధికారులు, పోలీసుల సహాయంతో వెళ్లి గూడెం కాళీ చేయించే ప్రయత్నం చేశారు. జేసిబీలు, డోజర్ల సహాయంతో వాళ్ళ గుడిసెలు నీలమట్టం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, స్థానికుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కర్రలు, కారం పొట్లాలు, కొడవళ్లతో తిరగబడ్డ గిరిజనులు జెసిబిలను అక్కడినుంచి ఉరికించారు.. అటవీశాఖ అధికారులపై తిరగబడ్డారు. వారిపై కారం చల్లి పరుగులు పెట్టించారు.
అయితే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఇలా నిర్మాణాల చేపట్టడం నేరంమంటున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఖాళీ చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే పలుదాఫాలు నోటీసులు ఇచ్చి వారిని నచ్చజెప్పి ఖాళీ చేయించడానికి ప్రయత్నించినా వినకుండా తమ పైన కర్రలు, కారం, కొడవళ్ళతో దాడిచేసి గాయపరిచారని ఆరోపించారు. విధులకు ఆటంకం కలిగించి గాయపరిచిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




