AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ రైతులకు గుడ్న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వర్షకాలం సాగుకోసం రైతన్నలకు అందించే రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రైతును రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండగ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

తెలంగాణ రైతులకు గుడ్న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి!
Cm
Anand T
|

Updated on: Jun 16, 2025 | 9:38 PM

Share

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని రైతులకు వర్షకాలంలో పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధులను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో రైతు భరోసా ఒకటి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.12వేలు రెండు విడతలుగా అందజేస్తుంది. ఒక్కో విడతో రూ.6వేల చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ క్రమంలోనే వర్షాకాలం సాగుకు సంబంధించి రైతులకు అందించాల్సిన పెట్టబడి సాయాన్ని సోమవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆన్‌లైన్‌లో బటన్‌ నొక్కి రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు. రాబోయే 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో 9 వేల కోట్లు రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఇవాళ తొలి విడతగా రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం నిధులు జమ చేసింది. రైతులందరి ఖాతాలలోకి ఎకరానికి 6 వేల చొప్పున రైతు భరోసా నిధుల వేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 41.25 లక్షల మంది రైతులకు సంబంధించిన 39.16 లక్షల ఎకరాలకు గాను రూ. 2349.83 కోట్ల రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రానున్న 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను 70,11,984 మంది రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్టు తెలిపింది.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..రైతును రాజుగా చేయడమే కాదు.. వ్యవసాయాన్ని పండగా చేయడమే ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. రైతుల ఆశీర్వాదం ఉంటేనే పాలకుల కుర్చీలు పదిలంగా ఉంటాయన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఎప్పుడూ రాజులేనన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యారాడ తీరానికి అనుకోని అతిథి..!
యారాడ తీరానికి అనుకోని అతిథి..!
బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ బ్యాంకు సేవలన్నీ బంద్‌!
బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ బ్యాంకు సేవలన్నీ బంద్‌!
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌ మారాయ్.. రైల్వేశాఖ అలర్ట్
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌ మారాయ్.. రైల్వేశాఖ అలర్ట్
దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..
దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..
రోజూ అరటిపండ్లు తింటే మీ బాడీలో జరిగే అద్భుతాలు ఇవే.. తెలిస్తే..
రోజూ అరటిపండ్లు తింటే మీ బాడీలో జరిగే అద్భుతాలు ఇవే.. తెలిస్తే..
ముగ్గురి ప్రాణాలు తీసిన దట్టమైన పొగమంచు..!
ముగ్గురి ప్రాణాలు తీసిన దట్టమైన పొగమంచు..!
పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
పాత ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ మిస్టేక్స్ చేస్తే భారీగా నష్టపోతారు
పాత ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ మిస్టేక్స్ చేస్తే భారీగా నష్టపోతారు
మీకు చలి ఎక్కువ అనిపిస్తుందా.. ఈ విటమిన్ లోపమే కారణం.. అసలు విషయం
మీకు చలి ఎక్కువ అనిపిస్తుందా.. ఈ విటమిన్ లోపమే కారణం.. అసలు విషయం
52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్
52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్