Telangana: కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారా..? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే లేదు!
ఇందులో చాలా సమస్యలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇందులో కుటుంబ సభ్యుల పేర్లు, అడ్రస్ మార్పునకు సంబంధించినవి 24 లక్షల వరకు వచ్చినట్టుగా సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాగే, వీటిలో చాలామంది పాత కార్డులో పేర్లు తొలగించకుండా దరఖాస్తు చేసుకున్నారు.. దీంతో కార్డుల మంజూరు అధికారులకు తలనొప్పిగా మారింది. అయితే, దీనిపై పౌరసరఫరాల శాఖ కీలక సూచనలు చేసింది.

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం అభ్యర్థులు బారులు తీరుతున్నారు. ప్రజావాణి, గ్రామసభలు, మీసేవ కేంద్రాల ద్వారా కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్న దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటి వరకు 13 లక్షల వరకు కొత్త దరఖాస్తులు స్వీకరించింది. కానీ, ఇందులో చాలా సమస్యలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇందులో కుటుంబ సభ్యుల పేర్లు, అడ్రస్ మార్పునకు సంబంధించినవి 24 లక్షల వరకు వచ్చినట్టుగా సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాగే, వీటిలో చాలామంది పాత కార్డులో పేర్లు తొలగించకుండా దరఖాస్తు చేసుకున్నారు.. దీంతో కార్డుల మంజూరు అధికారులకు తలనొప్పిగా మారింది. అయితే, దీనిపై పౌరసరఫరాల శాఖ కీలక సూచనలు చేసింది.
కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారంతా ముందుగా వారి పాత రేషన్ కార్డులో పేరు తొలగించుకోవాలని, ఆ తరువాతే మీసేవ కేంద్రాల ద్వారా కొత్త వాటికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎక్కడైనా ఒక ఆధార్ నంబర్ కార్డుకు అనుసంధానమై ఉంటే మరో కార్డుకు దరఖాస్తు చేసే వీలుండదు. కొత్తగా వివాహం చేసుకున్న మహిళ లు, అడ్రస్ మార్పు వంటి విషయం గమనించడం లేదని అన్నారు.. చాలా మందికి తమ పుట్టింట్లో ఉన్న రేషన్ కార్డులో పేర్లు ఉంటాయి. మెట్టినింటికి వచ్చిన అనంతరం నూతన కార్డు కోసం దరఖాస్తులు చేసినప్పుడు అవి తిరస్కరణకు గురవుతున్నాయి. వీరు పాత కార్డులోని తమ వివరాలను తొలగించాల్సిన అవసరం ఉంది.
కొత్తగా పెళ్లైన మహిళలు తమ పుట్టింట్లో ఉన్న రేషన్ కార్డులో తమ పేరును తప్పనిసరిగా తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వారు తహసీల్దార్‌కు ఒక లెటర్ రాసి ఇస్తే సరిపోతుంది. ఒక తెల్ల కాగితంపై స్థానిక తహసీల్దారుకు అభ్యర్థన పెట్టాలి. అత్తారింట్లో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకుంటున్నామని, పేరు తొలగించాలని దరఖాస్తు ఇస్తే సరిపోతుంది. వివాహం జరిగిన ధ్రువీకరణ పత్రం లేదా పెళ్లి పత్రికను కూడా జత చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తైన ఒకటి, రెండు రోజుల్లో పేర్లను తొలగిస్తారు. అనంతరం కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చునని సంబంధిత అధికారులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..