Revanth Reddy: రాజకీయాలు మరో మలుపు.. ప్రాణ స్నేహితుడికి ప్రమోషన్.. !
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ వేగంగా సాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ ఎన్నిక వెనుక ఉన్న కథను చూస్తే, ఇది కేవలం ఒక ఎమ్మెల్సీ పదవి కోసం జరిగే పోటీ కాదనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం ప్రారంభమైన స్నేహం, అరెస్టులు, రివెంజ్ ల సమాహారంగా కనిపిస్తోంది.
2015లో ప్రారంభమైన కథ
2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ‘ఓటుకు నోటు’ కేసు సంచలనం సృష్టించింది. అప్పుడు రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా ఉండగా, వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయడం జరిగిందనే ఆరోపణలతో కేసు నమోదైంది. ఆ ఘటనలో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారు. వేం నరేందర్ రెడ్డి రాజకీయంగా వెనుకబడ్డారు. అయితే, రాజకీయ సమీకరణాలు మారిన తర్వాత రేవంత్ కాంగ్రెస్‌లో చేరగా, వేం నరేందర్ రెడ్డి కూడా అదే బాటలో నడిచారు. అప్పటి నుంచి వేం నరేందర్ రెడ్డి – రేవంత్ రెడ్డికి నీడలా ఉండి ఆయన్ని అనుసరించారు.
ఆ తర్వాత మారిన పరిణామాలతో కాంగ్రెస్ లో చేరిన రేవంత్ వేంటే వేం కూడా చేరారు. అప్పటి నుండి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ కాలంలో మొత్తం రేవంత్ వేంటే నీడై నడిచారు వేం నరేందర్ రెడ్డి. కనీసం ఎమ్మెల్యే టిక్కెట్ కూడా అడగకుండా ఎన్నికలను దగ్గరుండి రేవంత్ యాక్షన్‌ను ప్లాన్ చేశారు. ఈలోపే ఎన్నికలు వచ్చాయి సీఎంగా రేవంత్ రెడ్డి భాద్యతలు చేపట్టారు.
ఇక రేవంత్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వేం నరేందర్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే వేం నరేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి సలహదారుగా నియమించారు. అప్పటి నుండి పార్టీతోపాటు, ప్రభుత్వ కార్యకలాపాలు, సీఎం యాక్టివిటి అంత వేం నరేందర్ రెడ్డి అన్ని తానై చూసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిపికేషన్ రావడంతో ఇప్పుడు అందరి చూపు వేం వైపు మళ్లింది.
అయితే తాజాగా తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేయడానికి కసరత్తు ప్రారంభించింది. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీఆర్ఎ్‌సకు వెళ్లే అవకాశముండగా, నాలుగింట్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేయనుంది. దీంతో ఇప్పుడు స్నేహం కోసం అనే మాట మళ్లీ వినిపిస్తుంది. 5 ఎమ్మెల్సీలలో నాలుగు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి రానున్నాయి. దీంతో ఇప్పుడు ఒక ఎమ్మెల్సీని వేం నరేందర్ రెడ్డికి ఇవ్వడం పక్కా అనే ప్రచారం జరుగుతుంది. వేం నరేందర్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి పెద్దల సభకు పంపడం ఖాయంగా కనిపిస్తోంది.
అదే ఎమ్మెల్సీ సీటుతో రివేంజ్ ప్లాన్?
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడటంతో, కాంగ్రెస్ తన అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేసింది. ఈసారి కాంగ్రెస్‌కు నాలుగు స్థానాలు రావడం ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తుండగా, వేం నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేసే అవకాశముంది. దీనివల్ల ఒకప్పుడు జరిగిన అన్యాయాన్ని సరి చేయడంతో పాటు, అప్పటి కేసుకు కారణమైన ఎమ్మెల్సీ సీటును ఇప్పుడే దక్కించుకోవడం ద్వారా, ఒక విధంగా రివేంజ్ తీర్చుకుంటున్నట్లవుతుందని చర్చ జరుగుతోంది.
వేం నరేందర్ రెడ్డికి మంత్రి పదవి?
ఎమ్మెల్సీగా వేం నరేందర్ రెడ్డిని పంపించడమే కాకుండా, రాబోయే రోజుల్లో ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆయనకు ప్రభావశీలమైన శాఖ కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కాంగ్రెస్ వ్యూహం రూపొందిస్తుండటంతో, ఆయనకు ఈ ఎన్నికలో అవకాశం దక్కే అవకాశాలు మరింత పెరిగాయి.
రాజకీయంగా కీలక దశలో నిర్ణయం
ఇప్పటికే వేం నరేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే, సామాజిక వర్గాల సమీకరణం, ఇతర పార్టీల ప్రతిపాదనలు, టీపీసీసీ నేతల అభిప్రాయాలు వంటి అంశాల ఆధారంగా ఆఖరి నిర్ణయం తీసుకోనున్నారు.
తుది నిర్ణయం త్వరలోనే..
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ వేగంగా సాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత తెలంగాణ రాజకీయాలు మరో మలుపు తిరగనున్నాయా? వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అవుతారా? లేక ఇంకా పెద్ద అవకాశం ఆయనను ఎదురుచూస్తుందా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..