Telangana: ఆ ఊరు కవలలకు నిలయం.. వైద్యులకూ అంతుబట్టని కారణం
ఆ వూళ్లో అందరూ కవలలే.. ఏ గల్లీలో చూసినా మన కళ్లు మనల్ని మోసం చేస్తున్నాయా అనిపిస్తుంది. ఊర్లోకి అడుగుపెడితే కన్ఫ్యూజన్ ఖాయం. అది కూడా వేరువేరు కుటుంబాల్లో కవలల జన్మించారు. వైద్యులకు కూడా ఇందుకు గల కారనాలు అంతుబట్టడం లేదు. అడవుల జిల్లాలోని హలో ట్విన్స్ విలేజ్‌పై టీవీ9 స్పెషల్ స్టోరీ.

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో ఉన్న గ్రామం వడ్డాడి.. కవలలకు కేరాఫ్ ఆడ్రస్‌గా పేరుపొందింది. ఆ ఊర్లోకి అడుగుపెడితే కన్ఫ్యూజన్‌కు గురవడం ఖాయం. ఎందుకంటే ఒకే పోలికలున్న ఇద్దరు వ్యక్తులు, పిల్లలు అక్కడ కనిపిస్తుంటారు. ఈ కవలలతోనే ఈ గ్రామం గుర్తింపుపొందుతోంది.
పేర్లలో సైతం ప్రత్యేకత కలిగివున్న కవలలు
చూసేవారికి ఆశ్చర్యం కలిగిస్తూ.. ఇంట్లో ఉన్నా.. బడికెళ్లినా.. బజారుకెళ్లినా.. బంధువులతో కలుసున్నా ప్రత్యేకతను చాటుకుంటున్నారు ఈ కవలలు. ఇద్దరికి వేరువేరు పేర్లున్నా ఒకే డ్రెస్ వేసుకుంటే ఒక్కోసారి ఇంట్లో వాళ్లే గుర్తుపట్టలేరు. తమ పేర్లలో సైతం ప్రత్యేకత కలిగివున్నారు ఈ గ్రామ కవలలు. విరాట్ – విశాల్, గౌతమి – గాయత్రి , హర్షిత్ – వర్షిత్, కావ్య – దివ్య, అలేహ –సలేహ ఇలా పదికి పైగా కవల జంటలున్నాయి ఈ గ్రామంలో.. ఇలా వేరు వేరు కుటుంబాల్లో కవలలు జన్మించడంపై వైద్యులు సైతం ఏమీ చెప్పలేకపోతున్నారు.
తికమక పడుతున్న టీచర్లు, సిబ్బంది
పాఠశాలల్లో ఈ కవలలను గుర్తించడంలో సిబ్బంది, ఉపాధ్యాయులు తికమకపడుతుంటారు. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు ఒకే ముఖచిత్రంతో కనిపిస్తేనే చిత్రంగా అనిపిస్తుంటుంది. అలాంటిది ఊరంతా కవలలే కనిపిస్తే చూసేవాళ్లకు అయోమయమే. గ్రామంలో స్వయంభువుగా వెలిసిన లక్ష్మి నారసింహస్వామి కృపతో కవలలు జన్మిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు.
ఇలా కవలల కారణంగా జిల్లాలోనే తమ గ్రామం ప్రత్యేకంగా గుర్తింపు సాధించడం తమకు ఎంతగానో ఆనందానిస్తుందంటున్నారు వడ్డాడి గ్రామస్థులు. ఈ ప్రత్యేకతే వడ్డాడి గ్రామానికి, ఆదిలాబాద్ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో సరికొత్త గుర్తింపును తెచ్చిపెడుతోంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
