AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ నియోజకవర్గ బీజేపీ నేతల్లో మొదలైన టెన్షన్.. ఎంపీ టికెట్ కోసం హోరా హోరీ ప్రయత్నం..

ఆ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ పార్టీలో సమీకరణాలు మారుతున్నాయి. ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ సమీకరణాల మార్పు పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కమలం పార్టీలో కొంత టెన్షన్, టెన్షన్‎గా ఉంటున్నారు కొంతమంది నేతలు. ఇంతకి అది ఏ నియోజకవర్గం.? ప్రధాని మోడీ పర్యటనతో ఉమ్మడి మెదక్ జిల్లా నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది.

Telangana: ఆ నియోజకవర్గ బీజేపీ నేతల్లో మొదలైన టెన్షన్.. ఎంపీ టికెట్ కోసం హోరా హోరీ ప్రయత్నం..
Telangana BJP
P Shivteja
| Edited By: |

Updated on: Mar 07, 2024 | 7:34 PM

Share

ఆ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ పార్టీలో సమీకరణాలు మారుతున్నాయి. ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ సమీకరణాల మార్పు పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కమలం పార్టీలో కొంత టెన్షన్, టెన్షన్‎గా ఉంటున్నారు కొంతమంది నేతలు. ఇంతకి అది ఏ నియోజకవర్గం.? ప్రధాని మోడీ పర్యటనతో ఉమ్మడి మెదక్ జిల్లా నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ప్రధాని సభ కూడా గ్రాండ్ సక్సెస్ కావడంతో ఉమ్మడి మెదక్ జిల్లా కమలం పార్టీ నేతలు అందరు హ్యాపీగా ఉన్నారు. అంతా బాగానే ఉన్నా కొంతమంది నేతలు మాత్రం ఆయోమాయనికి, ఆందోళనకు గురి అవుతున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా.. బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకు మెదక్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించకపోవడమే అని గుసగుసలాడుకుంటున్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి ఎవరు అనేది మొదటి లిస్ట్‎లోనే వస్తుందని అనుకున్నారట.. కానీ మొదటి లిస్ట్‎లో ఎవరి పేరు లేకపోవడంతో ఆశవహుల్లో కొత్త టెన్షన్ మొదలు అయ్యింది. మెదక్ పార్లమెంటు పరిధిలోని బీజేపీ పార్టీలో ఇటీవల రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్నాయి. సంగరెడ్డి జిల్లా అధ్యక్షుడి మార్పు కూడా ఇటీవలే జరిగింది. జిల్లా అధ్యక్షురాలుగా గోదావరి అంజిరెడ్డి అనే మహిళకు ఇచ్చారు. నిన్న ప్రధాని మీటింగ్ సక్సెస్ కావడంలో వీళ్ళ పాత్ర కూడా ఉందని బీజేపీ సీనియర్లు జాతీయ నేతలకు చెప్పారు. అయితే నిన్నటి ప్రధాని మీటింగ్‎కు పెద్ద ఎత్తున్న జనాలు రావడం.. మీటింగ్ అయిపోయే వరకు ఎవరు కదలకుండా మోడీ స్పీచ్ వినడం ఇవన్నీ చూసిన చాలా మంది బీజేపీ నేతలకు ఎంపీ సీట్‎పై ఆశలు పెరిగాయి.

మెదక్ బీజేపీ ఎంపీ సీట్ తనకే వస్తుందని మొదటి నుండి రఘునందన్ రావు తన అనుచరులకు చాలా సార్లు చెప్పారట. కొంతమంది నేతలకు డైరెక్ట్ గా ఫోన్లు చేసిమరీ టికెట్ తనకే అని, మీరందరు తనకు మద్దతు ఇవ్వాలని చెప్పినట్లు సమాచారం. అందుకే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి పాలుకాగానే మెదక్ ఎంపీ స్థానం‎పై దృష్టి సారించారు రఘునందన్. మెదక్ పార్లమెంటు పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా హాజరు అవుతున్నారు. ఇదే సమయంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరీ భర్త రాష్ట్ర నాయకులు అంజిరెడ్డి కూడా మెదక్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు జాతీయ స్థాయి నేతల వద్ద కూడా తన మనస్సులో మాట చెప్పినట్లు తెలుస్తోంది. గత మూడు సార్లు కూడా మెదక్ ఎంపీ టికెట్ తనకే ఇస్తా అని చెప్పి చివరి నిమిషంలో వేరే వాళ్లకు ఇచ్చారు అని, ఈసారి మాత్రం ఖచ్చితంగా మెదక్ ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని గట్టిగా అడుగుతున్నారట అంజిరెడ్డి. బీజేపీ పార్టీ రఘునందన్ రావు ఒకసారి ఎంపీ, మూడు సార్లు ఎమ్మెల్యే గా టికెట్ ఇచ్చింది కావున, ఈ సారి తనకే అవకాశం ఉంటుందని ధీమాగా ఉన్నారు అంజిరెడ్డి.

మరో వైపు మొదటి లిస్ట్‎లో రఘునందన్ రావు పేరు లేకపోవడంతో రఘునందన్‎తో పాటు ఆయన అనుచరులు కూడా కంగుతిన్నారు. పటాన్ చెరు‎లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరైన మోదీకి దండం పెట్టి తన సీట్ విషయం‎పై మాట్లాడినట్లు సమాచారం. అయితే ఇలాంటి సమయంలో బీజేపీ అధిష్టానం మెదక్ ఎంపీ సీటును పెండింగ్‎లో పెట్టడంతో ఈ ఇద్దరి నేతల్లో విపరీతమైన టెన్షన్ మొదలైందని చెప్పుకుంటున్నారు సీనియర్ నేతలు. రఘునందన్, అంజిరెడ్డి ఈ ఇద్దరు నేతలు టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారు. మొన్నటి ప్రధాని మీటింగ్ కి వచ్చిన రెస్పాన్స్‎ను చూసిన ఈ ఇద్దరు నేతలు ఎలాగైనా మెదక్ టికెట్‎ను దక్కించుకోవాలని చూస్తున్నారు. కానీ బీజేపీ అధిష్టానం మరోసారి రఘునందన్ వైపు మొగ్గు చూపుతోందా.. లేదంటే అంజిరెడ్డికి అవకాశం ఇస్తుందా అనే దాని పై మెదక్ పార్లమెంట్ పరిధిలో పెద్ద చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.