Telangana: ఆ ఊర్లో స్మశానంలోనే శివరాత్రి వేడుకలు.. స్వయంభువుగా శివయ్య..!

ఎటు చూడు ఓం నమ శివాయ పంచాక్షరీ మంత్రం.. శివ నామస్మరణతో శైవ క్షేత్రాలు, ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. ఫిబ్రవరి 8న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది. బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకం, పంచామృతాలతో అభిషేకాలు, భస్మాభిషేకాలకు భక్తులకు సిద్దమవుతున్నారు. అయితే మీకు ఓ ప్రత్యేకమైన శివాలయం గురించి చెప్పాలి.

Telangana: ఆ ఊర్లో స్మశానంలోనే శివరాత్రి వేడుకలు.. స్వయంభువుగా శివయ్య..!
Lord Shiva
Follow us
Naresh Gollana

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 07, 2024 | 6:13 PM

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లాలోని శివాలయాలు ముస్తాభవుతున్నాయి. అన్ని శివాలయాలు ఒకెత్తు ఆ ఒక్క శివాలయం మాత్రం ఒకెత్తు అన్నట్టుగా అక్కడ పూజ కార్యక్రమాలు సాగనున్నాయి. కారణం ఆ శివాలయం ఉన్నది భూతనాధుడు కొలువై ఉన్నట్లుగా చెప్పే స్మశానంలోనే. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పురాతన చర్లపల్లి గ్రామంలో ఉంది ఆ శివాలయం.

చర్లపల్లి గ్రామంలో స్మశానంలో 3 దశాబ్దాల‌ క్రితం ఏకబిల్వ వృక్షం మొలవగా.. అక్కడే స్వయంభువుగా శివయ్య వెలిశాడని భక్తితో శివరాత్రి వేళ స్మశానంలో భక్తి శ్రద్దలతో పూజలు చేస్తున్నారు ఆ గ్రామస్తులు. గత 20 ఏళ్ల నుండి అదే చెట్టు కింద ఆ పరమశివుని గ్రామస్తులు కొలుస్తున్నారు.  10 ఏళ్ల క్రితం ఆలయం నిర్మించుకొని.. శివరాత్రి పండుగ వేళ శివపార్వతుల కళ్యాణం పల్లకి సేవలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్మశానంలోనే సేదతీరే శివయ్యకు మాకు తోచిన కైంకర్యాలను ఇదే స్మశానంలో నిర్వహిస్తున్నామంటున్నారు ఆలయ పూజారి సత్యనారాయణ.

అలాగే ఇదే మండలంలోని ఝరీ గ్రామంలో వెలసిన శివాలయం గత 500 ఏళ్ల చరిత్ర కలిగిందని.. చోళ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని గ్రామస్తులు చెపుతున్నారు. ఈ గ్రామంలోను శివరాత్రి అంగరంగవైభవంగా సాగుతుంది. శివయ్య ను‌ దర్శించుకునేందుకు స్థానిక మండల ప్రజలతో పాటు జిల్లా నలుమూలల నుండే కాకుండా సరిహద్దు రాష్ట్రం మహారాష్ట్ర నుండి కూడా శివ భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి ఝరీ శివాలయాన్ని దర్శించుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.