Mahashiva: దేశంలోనే తొలి సహస్ర లింగం.. క్రీ.శ. 4వ శతాబ్ధం నాటి విగ్రహాం ఎక్కడుందో తెలుసా..?
అది దేశంలోనే తొలి సహస్ర లింగం. ఆనంద గోత్రికుల కాలం నాటి అరుదైన శిల్పం. 1600 వందల ఏళ్ళ క్రితమే దానిని అందంగా ఆనాటి శిల్పులు చెక్కారు. పల్నాడు జిల్లాలోని ఒక ఆలయంలో ఉన్న అరుదైన శిల్పాన్ని పురాతన శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. అరుదైన, అందమైన శిల్పాన్ని కాపాడుకోవాలంటూ స్థానికులకు విజ్ఞప్తి చేశారు.
అది దేశంలోనే తొలి సహస్ర లింగం. ఆనంద గోత్రికుల కాలం నాటి అరుదైన శిల్పం. 1600 వందల ఏళ్ళ క్రితమే దానిని అందంగా ఆనాటి శిల్పులు చెక్కారు. పల్నాడు జిల్లాలోని ఒక ఆలయంలో ఉన్న అరుదైన శిల్పాన్ని పురాతన శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. అరుదైన, అందమైన శిల్పాన్ని కాపాడుకోవాలంటూ స్థానికులకు విజ్ఞప్తి చేశారు. చేజర్లలో మన దేశపు తొలి సహస్ర లింగం ఉంది. పల్నాడు జిల్లా చేజర్లలో క్రీ.శ. 4వ శతాబ్దికి చెందిన సహస్ర లింగంగా దీనిని గుర్తించారు. చేజర్లలో 1600 సంవత్సం నాటి తొలి సహస్ర లింగం ఉన్నట్లు పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి చెప్పారు.
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్ల కపోతేశ్వరాలయ ప్రాంగణంలోనున్న పల్నాటి సున్నపురాతిలో చెక్కిన శివలింగమే మన దేశపు తొలి సహస్ర లింగం అని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గల సహస్ర లింగాలపై ఆయన ప్రత్యేక పరిశోధన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల చేజర్ల కపోతేశ్వరాలయంలోని సహస్ర లింగాలను అధ్యయనం చేశారు. ఆరడుగుల ఎత్తుతో పల్నాడు సున్నపు రాతిలో చెక్కిన శివలింగంపై, 25 నిలువు వరుసలున్నాయని, ఒక్కో వరుసలో 40 చిన్న శివలింగాల చొప్పున మొత్తం వెయ్యి శివలింగాలున్నాయని చెప్పారు. అసలు శివ లింగంతో కలిపితే ఆ రాతిపై 1001 శివలింగాలున్నాయని, ఈ శివలింగాన్ని ఏకోత్తర సహస్ర లింగ మంటారన్నారు. సర్వం శివమయం అన్న భావనకు ఇది తొలి ప్రతీక అని ఆయన తెలిపారు.
ప్రతిమా లక్షణాన్ని, ఇంకా పల్నాటి సున్నపురాతిపై చెక్కటాన్ని అనుసరించి, ఈ సహస్ర లింగం, కపోతపురమని పిలవబడిన చేజర్ల రాజధానిగా, ఉమ్మడి గుంటూరు మండలాన్ని పాలించిన శైవమతాభిమానులైన ఆనంద గోత్రిన రాజవంశీకుల క్రీ.శ. 4వ శతాబ్ది కాలానికి చెందిందని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటిదాకా ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని పరశురామేశ్వరాలయంలో ఉన్న క్రీ.శ. 7వ శతాబ్దం నాటి సహస్ర లింగమే, అత్యంత ప్రాచీనమైనదని చరిత్రకారులు భావిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖ అమరావతి సర్కిల్ పరిధిలోనున్న చేజర్ల సహస్ర లింగం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. శివరాత్రి పర్వదిన సందర్భంగా, దేశంలోనే తొలిదైన ఈ సహస్ర లింగాన్ని సందర్శించి తరించాలని పల్నాడు జిల్లా ప్రజలకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
చేజెర్ల కపోతేశ్వరాలయం చారిత్రక నేపధ్యమున్నా ఆలయంగా గుర్తింపు పొందింది. ఏనుగు వెనుక భాగం ఆకారంలో ఈ ఆలయం నిర్మించారని అంటారు. అటువంటి ఆలయంలోనే అత్యంత్య పురాతన ఆలయం బయట పడింది. పల్నాడు జిల్లాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత్య అరుదైన విగ్రహాన్ని అటు స్థానికులు ఇటు ప్రభుత్వం సంరక్షించాల్సి ఉంది..!
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…