Telangana: సిరుల సింగరేణి ప్రగతి పథంలో మరో ముందడగు.. గుడ్ న్యూస్ చెప్పిన భట్టి
నల్ల బంగారు సిరుల సింగరేణి ప్రగతి పథంలో మరో ముందడగు పడింది. తెలంగాణ ప్రభుత్వ చొరవతో తాడిచెర్ల సెకండ్ బ్లాక్‌లో మైనింగ్‌కు దాదాపు లైన్ క్లియరైంది. అలాగే సోలార్ వెలుగులకు తోవ పడింది కూడా. ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం ఈ మేరకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం..
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమర్క. కేంద్ర అనుమతి లేక ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో తాడేపల్లి సెకండ్ బ్లాక్ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కి అప్రూవల్‌పై కేంద్రం సానుకూలంగా స్పందించడం శుభవార్త అన్నారు డిప్యూటీ సీఎం. తాడిచెర్ల రెండో బ్లాక్‌లో 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అవకాశం వుందన్నారు భట్టి విక్రమార్క. సింగరేణికి, రాష్ట్రానికి ఇది ప్రయోజనమన్నారు. ఒడిషాలోని నైని కోల్ బ్లాక్‌లో తెలంగాణకు కేటాయింపులు చేసినప్పటకి అందుకు సంబంధించి ఆపరేషన్స్ ఇంకా మొదలు కాలేదు. ఆ విషయంలో కూడా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సానుకూలంగా స్పందించారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
అటు కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్‌తోనూ సమావేశమయ్యారు భట్టి విక్రమార్క. గ్రీన్ పవర్ సహా ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై చర్చించారు. పేదల ఇళ్లకు సోలార్ కరెంట్ అందించేలా కేంద్రం ఇచ్చే సబ్సిడీ కి అదనంగా మరింత ఖర్చును భరిస్తూ రాష్ర్ట ప్రభుత్వం రూపొందించిన పథకాన్ని కేంద్రమంత్రికి వివరించారు భట్టివిక్రమార్క. అభినందడంతో పాటు తప్పక చేయూతనిస్తామని ఆర్కేసింగ్ సానుకూలంగా స్పందించారన్నారు.
తెలంగాణకు ఎంతో ప్రయోజనం కల్గించే రెండు ముఖ్య అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.