AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వేసిన తాళం వేసినట్టే ఉంచి.. ఇల్లు గుళ్ల చేసిన కేటుగాళ్లు.. ఎలానో తెలిస్తే..

గ్రామాల్లో చాలా వరకు రైతులు పొలాలకో, లేదా కూళీలకు వెళ్లే టప్పడు ఇళ్లు తాళం వేసి తాళం చెవి ఇంటి గుమ్మం గూటిలోనో, లేదా పూలకుండీలలో పెట్టి వెళ్తుంటారు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఇలాంటి పద్దతే కొనసాగుతుంది. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇలానే ఓ ఇంటి గుమ్మంలో పెట్టిన తాళాన్ని తీసుకొని ఇంటిని మొత్తం దోచుకున్నారు. మళ్లీ ఏమి ఎరగనట్టు తాళం అక్కడే పెట్టి వెళ్లిపోయారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో వెలుగు చూసింది.

Telangana: వేసిన తాళం వేసినట్టే ఉంచి.. ఇల్లు గుళ్ల చేసిన కేటుగాళ్లు.. ఎలానో తెలిస్తే..
Tg News
G Peddeesh Kumar
| Edited By: Anand T|

Updated on: Oct 26, 2025 | 4:46 PM

Share

అలవాటు ప్రకారం ఇంటి గుమ్మం గూట్లో తాళంపెట్టి పనికిపోయిన ఒక మహిళకు ఊహించని షాక్ తగిలింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సరికి దొంగలు వాళ్ల ఇంటిని మొత్తం గుళ్ల చేశారు. ఇంట్లో ఉన్న బంగారంతో పాటు నగదును మొత్తం దోచుకెళ్లారు. బీరువాలో ఉన్న నగలు, డబ్బు కనిపించకపోయే సరికి దొంగ తన జరిగినట్టు గమనించిన మహిళ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విచిత్ర చోరీ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో జరిగింది.. ఇంటి ముందు గూటిలో భద్రపరచిన తాళం చెవి తీసుకొని దొంగలు దర్జాగా ఇంట్లో ఉన్న సొమ్మంతా కూల్చుకుపోయారు..6 తులాల బంగారు ఆభరణాలు, 17 తులాల వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీ చేశారు. అనసూయ అనే మహిళ తన ఇంటికి తాళం వేసి ఇంటి ముందు ఆవరణలోని గూటిలో తాళం చెవిపెట్టి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజు ఉదయం వచ్చి గూటిలో ఉన్న తాళం చెవి తీసుకొని ఇంటికి వేసిన తాళం తెరిచి ఇంట్లోకి వెళ్ళింది.

ఇంట్లోని లోపలి గది తలుపులు తెరిచి ఉండడం చూసి.. గబగబ గదిలోకి వెళ్లింది. గదిలో ఉన్న బీరువా తెరిచి ఉండంతో దాచి పెట్టిన బంగారం, నగదు కనిపించకపోవడంతో ఇంట్లో దొంగలు పడి చోరీ జరిగిందని గ్రహించి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇంటి తాళాలు గూటిలో పెడుతారని తెలిసిన వాళ్ళే చొరీ చేశారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
2026 మకరరాశి వారికి ఎలా ఉండనుందో తెలుసా? కెరీర్, ఆర్థిక పరిస్థితి
2026 మకరరాశి వారికి ఎలా ఉండనుందో తెలుసా? కెరీర్, ఆర్థిక పరిస్థితి
మరో వారంలో అలెన్ స్కాలర్‌షిప్ అడ్మిషన్ టెస్ట్ 2026.. సిద్ధమేనా?
మరో వారంలో అలెన్ స్కాలర్‌షిప్ అడ్మిషన్ టెస్ట్ 2026.. సిద్ధమేనా?
ఉన్న చోటే ఉంటూ నెలకు రూ.50 వేలు సంపాదించుకోవచ్చు!
ఉన్న చోటే ఉంటూ నెలకు రూ.50 వేలు సంపాదించుకోవచ్చు!
రూ. 43 కోట్లతో డాడీస్ జట్టు ర్యాంపేజ్ మాములుగా ఉండదు
రూ. 43 కోట్లతో డాడీస్ జట్టు ర్యాంపేజ్ మాములుగా ఉండదు
గంభీర్ పదవిపోతే.. ఈ ఆటగాడు టీమిండియాలో ఎప్పటికీ కనిపించడు
గంభీర్ పదవిపోతే.. ఈ ఆటగాడు టీమిండియాలో ఎప్పటికీ కనిపించడు
తరుచుగా ముఖం కడిగితే మొటిమలు తగ్గుతాయా.. అపోహలు కాదు వాస్తవాలు..
తరుచుగా ముఖం కడిగితే మొటిమలు తగ్గుతాయా.. అపోహలు కాదు వాస్తవాలు..
ఐఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌!
ఐఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌!
రోహిత్, కోహ్లీలతోపాటు టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ
రోహిత్, కోహ్లీలతోపాటు టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ