AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TET Review Petition: అన్నంత పని చేసిన సర్కార్ బడి టీచర్లు.. సుప్రీంకోర్టులో టెట్‌ రివ్యూ పిటిషన్‌ దాఖలు

Telangana TET review petition in Supreme Court: ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) పాస్‌ కావడం తప్పనిసరని సుప్రీంకోర్టు సెప్టెంబరు 1న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వచ్చే రెండేళ్లలో ఉత్తీర్ణులు కావాలని కండీషన్‌ కూడా పెట్టింది. అయితే దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. దీంతో సమీక్షించాలని..

TET Review Petition: అన్నంత పని చేసిన సర్కార్ బడి టీచర్లు.. సుప్రీంకోర్టులో టెట్‌ రివ్యూ పిటిషన్‌ దాఖలు
TET review petition in Supreme Court
Srilakshmi C
|

Updated on: Oct 26, 2025 | 4:27 PM

Share

హైదరాబాద్‌, అక్టోబర్‌ 26: ప్రభుత్వ బడుల్లో సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) పాస్‌ కావడం తప్పనిసరని సుప్రీంకోర్టు సెప్టెంబరు 1న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వచ్చే రెండేళ్లలో ఉత్తీర్ణులు కావాలని కండీషన్‌ కూడా పెట్టింది. అయితే దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. దీంతో సమీక్షించాలని సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీఆర్‌టీఎఫ్‌) తాజాగా రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. విద్యాహక్కు చట్టం తీసుకొచ్చిన సమయంలో 2010కి ముందు ఉద్యోగాల్లో చేరిన వారికి టెట్‌ అవసరం లేదని ఎన్‌సీటీఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే 2017లో ఆ నిబంధనల్లో సవరనలు చేశారు. దీన్ని సమీక్షించి మార్పు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని టీఆర్‌టీఎఫ్‌ రివ్యూ పిటిషన్‌లో పేర్కొంది. దీంతో దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు ఏపీలో ఇప్పటికే టెట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో విధుల్లో ఉన్న టీచర్లకు టెట్‌ తప్పనిసరి చేస్తూ పరీక్ష రాసేందుకు అనుమతి కల్పించింది. దీంతో నిరుద్యోగులతోపాటు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా టెట్‌ పరీక్ష రాసేందుకు సన్నద్ధమవుతున్నారు.

గత 11 ఏళ్లలో 432 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్నాటు చేశాం.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా

దేశ వ్యాప్తంగా గత 11 ఏళ్లలో దాదాపు 432 కొత్త మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా తెలిపారు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) 50వ వార్షిక స్నాతకోత్స వంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరక ఆయన కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో మెడికల్‌ కాలేజీల సంఖ్య 387 నుంచి 819కి పెరిగాయన్నారు. అలాగే మెడికల్‌ సీట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. దీంతో అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) మెడికల్ సీట్లు 51 వేల నుంచి 1.29 లక్షలకు, పీజీ సీట్లు 31 వేల నుంచి 78 వేలకు చేరాయని తెలిపారు. రానున్న ఐదేళ్లలో ఈ రెండు కోర్సులకు కలిపి మరో 75 వేల కొత్త సీట్లు వస్తాయని మంత్రి వెల్లడించారు. దేశంలో మాతాశిశు మరణాల నిష్పత్తి భారీగా తగ్గిందని ఈ సందర్భంగా ఆయా గణాంకాలను వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.