Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress: బీఆర్ఎస్ కంచుకోటలో కాంగ్రెస్ ఎలా పాగా వేసింది.. ఆ జిల్లాలో బీజేపీ లెక్కలు ఎందుకు తప్పాయి

కేసిఆర్ కి కరీంనగర్ సెంటెమెంట్. ఇక్కడ ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఆదరిస్తూ వస్తున్నరు ప్రజలు. తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో ఈ జిల్లానే కీలక పాత్ర పోషించింది. అయితే..ఇప్పుడు విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కనిపించింది. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. ముఖ్యమైన బీఆర్ఎస్ నేతలు ఓటమి చెందారు.

Congress: బీఆర్ఎస్ కంచుకోటలో కాంగ్రెస్ ఎలా పాగా వేసింది.. ఆ జిల్లాలో బీజేపీ లెక్కలు ఎందుకు తప్పాయి
These Are The Reasons Brs Lost In Karimnagar And Congress Won..
Follow us
G Sampath Kumar

| Edited By: Srikar T

Updated on: Dec 05, 2023 | 10:12 PM

కేసిఆర్ కి కరీంనగర్ సెంటెమెంట్. ఇక్కడ ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఆదరిస్తూ వస్తున్నరు ప్రజలు. తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో ఈ జిల్లానే కీలక పాత్ర పోషించింది. అయితే..ఇప్పుడు విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కనిపించింది. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. ముఖ్యమైన బీఆర్ఎస్ నేతలు ఓటమి చెందారు. ఇక్కడ బీఆర్ఎస్ అంచనాలు తారుమారయ్యాయి. అయితే.. బీజేపీ ఈ జిల్లాపై ఆశలు పెట్టుకుంది. కానీ, గెలువలేకపోయింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ కి కంచుకోట. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇక్కడి ప్రజలు ఆదరిస్తు వస్తున్నారు. గతంలో రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లిన సందర్భంలో కూడా.. బీఆర్ఎస్ ని గెలిపించారు. గతంలో కాంగ్రెస్ ఎంత బలంగా ఉన్నప్పటికీ, ఇక్కడ మాత్రం గులాబీ జెండా ఎగిరింది. 2014, 2018 ఎన్నికల్లో 13 స్థానాలకు గానూ.. 12 స్థానాల్లో విజయం సాధించి.. తన సత్తాను చాటుకుంది. ఇప్పటి ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితాలు వస్తాయని భావించింది బీఆర్ఎస్. కానీ.. అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. 8 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. 5 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది.

ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓటమి పాలయ్యారు. అదే విధంగా.. కరీంనగర్లో మరో మంత్రి గంగుల కమలాకర్ గట్టి పోటీని ఎదుర్కొన్నారు. చివరి వరకు లెక్కింపు ఉత్కంఠగా కొనసాగింది. చివరకు 3 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. మిగతా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటితో విజయం సాధించారు. రామగుండం, పెద్దపల్లి, చొప్పదండి, మానకొండూరులో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించారు. బీఆర్ఎస్ విజయం సాధించిన స్థానాల్లో గట్టీ పోటీ ఇచ్చి విజయం సాధించారు. కనీసం పది స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమాతో బీఆర్ఎస్  ఉంది. అయితే..ఇక్కడ బీజేపీ ఆశలు పెట్టుకుంది. ముఖ్య నేతలు ఇక్కడి నుంచి బరిలోకి దిగారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్.. హుజురాబాద్ నుంచి ఈటెల రాజేందర్., కోరుట్ల నుంచి అరవింద్ పోటీ చేశారు. కానీ.. ఈ ముగ్గురు ఓడిపోయారు. రెండవ స్థానానికి పరిమితమయ్యారు. బండి మాత్రమే గట్టి పోటీ ఇచ్చారు. ఈ ఇద్దరు.. నేతలు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయారు. చాలా యేళ్ల తరువాత.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పుంజుకుంది. కాంగ్రెస్ లో సీనియర్ నేతలు.. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ విజయం సాధించారు. మరో సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓటమిపాలయ్యారు.

ఇవి కూడా చదవండి

అనుకున్న స్థాయిలో.. బీఆర్ఎస్ గెలువలేకపోవడంతో కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ అనుకున్న స్థాయిలో సీట్లు వస్తే.. హంగ్ వచ్చే అవకాశం ఉండేదీ. కాంగ్రెస్ ఈ జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దీంతో అనుకున్న స్థాయిలో సీట్లు సాధించింది. అయితే, బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడంతో.. కొన్ని చోట్ల కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారింది. జగిత్యాలలో బీజేపీ అభ్యర్థి భోగ శ్రావణీ 42 వేలకు పైగా ఓట్లు సాధించడంతో ఇక్కడ ఫలితం తారుమారైంది. ఇది బీఆర్ఎస్ కి అనుకూలంగా మారి విజయం సాధించారు. అదే విధంగా వేములవాడలో బీజేపీకి 25 వేయిలకు పైగా ఓట్లు సాధించడంతో.. కాంగ్రెస్ మెజారిటీ తగ్గింది. ఒక్క దశలో హోరాహోరీ పోరు సాగింది. బీజేపీ సీట్లు గెలవకున్న ఓట్ల శాతం పెంచుకుంది. అయితే లోక్ సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతామని బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బింబిసారుడు దాచిన బంగారం ఎక్కడుందో తెలుసా..? ఆ ద్వారం తెరిస్తే
బింబిసారుడు దాచిన బంగారం ఎక్కడుందో తెలుసా..? ఆ ద్వారం తెరిస్తే
సంచలన నిర్ణయం.. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత
సంచలన నిర్ణయం.. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత
ఆందోళన వద్దు ఆదుకుంటాం.. ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు భరోసా
ఆందోళన వద్దు ఆదుకుంటాం.. ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు భరోసా
పెళ్లిలో చెప్పుల గొడవతో పెళ్లికొడుకును చితకొట్టారు..
పెళ్లిలో చెప్పుల గొడవతో పెళ్లికొడుకును చితకొట్టారు..
రెండేళ్ల నిషేధం తర్వాత నాసిర్ గ్రాండ్ రీ ఎంట్రీ!
రెండేళ్ల నిషేధం తర్వాత నాసిర్ గ్రాండ్ రీ ఎంట్రీ!
జితేష్-దయాల్ క్యాచ్ మిస్.. కోహ్లీ ప్రస్టేషన్ చూడాల్సిందే భయ్యో
జితేష్-దయాల్ క్యాచ్ మిస్.. కోహ్లీ ప్రస్టేషన్ చూడాల్సిందే భయ్యో
ట్రంప్‌ సుంకాలను రద్దు చేస్తున్నారా? వైట్‌ హౌస్‌ ప్రకటన ఏంటి?
ట్రంప్‌ సుంకాలను రద్దు చేస్తున్నారా? వైట్‌ హౌస్‌ ప్రకటన ఏంటి?
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సరికొత్త రికార్డు.. వాటన్నింటిని దాటి..
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సరికొత్త రికార్డు.. వాటన్నింటిని దాటి..
ప్లే ఆఫ్స్‌కు దూరంగా 3 జట్లు.. 2వ వారంలోనే చేతులెత్తేశారుగా..
ప్లే ఆఫ్స్‌కు దూరంగా 3 జట్లు.. 2వ వారంలోనే చేతులెత్తేశారుగా..
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..