Telangana: తెలంగాణ సీఎంపై కొనసాగుతున్న సస్పెన్స్.. ముగిసిన అధిష్టానం భేటీ.. మరికాసేపట్లో..
స్పష్టమైన మెజార్టీతో తెలంగాణలో విజయం సాధించినా సీఎం ఎవరనేది కాంగ్రెస్ తేల్చుకోలేకపోతోంది. ఫలితాల వెల్లడై రెండు రోజులవుతున్నా సీఎం ఎవరన్నది హస్తం పార్టీ నిర్ణయించుకోలేకపోతోంది. గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సేకరించిన డీకే శివకుమార్.. పార్టీ అధిష్టానానికి రిపోర్ట్ సమర్పించారు. అంతకన్నా ముందు భట్టి, ఉత్తమ్‌లతో వేర్వేరుగా డీకే చర్చలు జరిపారు. ఎమ్మెల్యేల అభిప్రాయంతో పాటు ఆ ఇద్దరు నేతల డిమాండ్లను అధిష్టానం ముందు ఉంచారు డీకే.

డీకే సమర్పించిన నివేదికపై ఖర్గే ఇంట్లో రాహుల్, కేసీ వేణుగోపాల్ చర్చలు జరిపారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఠాక్రే, డీకేతో మల్లిఖార్జున్‌ఖర్గే కాసేపు చర్చించారు. అనంతరం డీకే, ఠాక్రే నేరుగా హైదరాబాద్ బయలుదేరారు. సీఎం ఎవరనేది దాదాపుగా ఖాయమైనట్టు తెలుస్తోంది. డీకే శివకుమార్ హైదరాబాద్ వచ్చాక సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సాయంత్రంలోపు సీఎం అభ్యర్థి ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోనే ఉన్న భట్టి, ఉత్తమ్.. అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ ఇప్పటికే సీఎం అభ్యర్థిపై పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో క్యాబినెట్ కూర్పుపైనా ఢిల్లీలో చర్చ జరుగుతోంది.
NO FAKE NO BOTJUST ORIGINAL
డిజిటల్ రంగంలో అన్ని రికార్డులను బద్దలు కొట్టిన #TV9Telugu pic.twitter.com/nBSqWBMn6R
— TV9 Telugu (@TV9Telugu) December 5, 2023
No.1 న్యూస్ నెట్‌వర్క్.. No.1 ఎలక్షన్ కవరేజ్.. డిజిటల్ రంగంలో రికార్డులు బద్దలు కొట్టిన టీవీ9 తెలుగు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..