TV9 Network: సరిలేరు మాకెవ్వరు.. రికార్డులన్నీ బద్దలు కొట్టిన No.1 న్యూస్ నెట్‌వర్క్ టీవీ9
No.1 న్యూస్ నెట్‌వర్క్.. No.1 ఎలక్షన్ కవరేజ్.. వినూత్న ఎలక్షన్ ప్రోగ్రామ్స్.. సాటిలేని ప్రజెంటేషన్‌తో నెంబర్ వన్‌గా నిలిచింది టీవీ9. హైటెక్ బస్సులో హైవోల్టేజ్ ఎలక్షన్ షో నిర్వహించి వావ్ అనిపించింది. పొడుస్తున్న పొద్దుపై నడుస్తున్న బస్సులో తెలంగాణ అంతటా ప్రయాణించి ప్రజాగళం వినిపించింది టీవీ9.

No.1 న్యూస్ నెట్‌వర్క్.. No.1 ఎలక్షన్ కవరేజ్.. వినూత్న ఎలక్షన్ ప్రోగ్రామ్స్.. సాటిలేని ప్రజెంటేషన్‌తో నెంబర్ వన్‌గా నిలిచింది టీవీ9. హైటెక్ బస్సులో హైవోల్టేజ్ ఎలక్షన్ షో నిర్వహించి వావ్ అనిపించింది. పొడుస్తున్న పొద్దుపై నడుస్తున్న బస్సులో తెలంగాణ అంతటా ప్రయాణించి ప్రజాగళం వినిపించింది టీవీ9. అటు తెలంగాణను చుట్టి..జనం గొంతు వినిపించింది బుల్లెట్ రిపోర్టర్. ఇలా.. జనం గోసకు గొంతుకైన టీవీ9.. అదే జనం కోసం జనతా దర్బార్ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణను స్వీకరించింది. ఇక నేతల ప్రచార సరళిని ప్రేక్షకుల ముందుంచింది షాడో 9. సరికొత్త పోగ్రామ్‌తో అభ్యర్థుల మంచిచెడులను ఓటర్లు బేరీజు వేసుకునే అవకాశం కల్పించింది టీవీ9.
పోలింగ్ రోజు టీవీ9 ప్రజెంటేషన్ ఇక నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. టీవీ9 AR, VR ప్రెజెంటేషన్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎగ్జిట్ పోల్స్‌తో కట్టిపడేసింది టీవీ9. కౌంటింగ్ రోజు సాలిడ్ ప్రజెంటేషన్‌తో సెన్సేషనల్ క్రియేట్ చేసింది టీవీ9. అందరికంటే వేగంగా..అత్యంత ఖచ్చితంగా ఫలితాలు ఇస్తూ.. టీవీ9 సూపర్ సండే కవరేజ్‌కు Youtube రికార్డులు బద్దలయ్యాయి. తెలంగాణ పొలిటికల్ థ్రిల్లర్‌లో టీవీ9 బ్లాక్‌బస్టర్.

Tv9 Telugu
ఏ ఛానల్ కూడా అందుకోలేనంతగా టీవీ9 రికార్డులను తిరగరాసింది. పోలింగ్ (నవంబర్ 30) డేట్ రోజు 21.48 మిలియన్ల వ్యూస్ తో టీవీ9 దూసుకెళ్లింది. ఫలితాల నాడు.. 79.69 మిలియన్ల వ్యూస్ తో సత్తాచాటింది.. తెలుగు మీడియాలో ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు టీవీ9 దూసుకెళ్లింది. ఏ ఛానల్ కూడా టీవీ9 దరిదాపుల్లోకి కూడా రాలేదంటూ ప్రజల అభిమానాన్ని ఎంతగా చొరగొందో తెలుసుకోవచ్చు. తెలంగాణ దంగల్ పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు తెలుగు మీడియా వ్యూస్ లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి..
తెలుగు మీడియాలో టాప్ TV9
NO FAKE NO BOT JUST ORIGINAL
డిజిటల్ రంగంలో అన్ని రికార్డులను బద్దలు కొట్టిన #TV9Telugu pic.twitter.com/nBSqWBMn6R
— TV9 Telugu (@TV9Telugu) December 5, 2023
తెలంగాణ ఎన్నికలకు ముందు వాట్ తెలంగాణ థింక్స్ టుడే పేరుతో మెగా కాంక్లేవ్‌ను నిర్వహించింది టీవీ9. తెలుగు మీడియా చరిత్రలో తొలిసారి ఈ మహా రాజకీయ సదస్సును టీవీ9 నిర్వహించింది. ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నది ఈ కాంక్లేవ్ ద్వారా ప్రజెంట్ చేసింది.. ఇది తెలుగు మీడియా హిస్టరీలోనే ఓ మైలురాయిగా నిలిచింది ఈ కాంక్లేవ్.
అంతేకాకుండా, టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ వెల్లలచెరువు రజినీకాంత్ నేతృత్వంలో జరిగిన బిగ్ న్యూస్ బిగ్ డిబేట్.. జనం గొంతుకంగా నిలిచింది. తెలంగాణ ఎన్నికల్లో మెగా పొలిటికల్ షో 5 ఎడిటర్స్. రెండు దశాబ్దాల చరిత్రలో.. తెలుగు మీడియా కనీవినీ ఎరుగని రీతిలో ఐదుగురు సీనియర్ ఎడిటర్లతో ఈ ప్రోగ్రామ్ నిర్వహించింది. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎంతో అనుభవం ఉన్న టీవీ9 ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ మురళికృష్ణ ఈ పోగ్రామ్‌ను మరో లెవల్‌కి తీసుకెళ్లారు. ప్రజల పక్షాల బలమైన గొంతు వినిపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..