AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Jobs 2026: లక్షకు పైగా జీతంతో బ్యాంక్ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) కార్పొరేట్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగంలో మొత్తం 86 మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజర్‌, సీనియర్ మేనేజర్‌, చీఫ్ మేనేజర్‌ స్థాయి ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు జులై 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.93,960 నుంచి రూ.1.20 లక్షలకు పైగా వేతనంతో పాటు ఇతర అలవెన్సులు అందించనున్నారు..

Bank Jobs 2026: లక్షకు పైగా జీతంతో బ్యాంక్ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
Bank Of Baroda Recruitment
Srilakshmi C
|

Updated on: Jun 19, 2026 | 7:16 AM

Share

అతిపెద్ద బ్యాంకింగ్‌ వ్యవస్థ కలిగిన బ్యాంక్ ఆఫ్ బరోడాలోని కార్పొరేట్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ (C&IC) విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన దేశంలోని వివిధ బ్రంచుల్లో మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 86 మేనేజర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జులై 6, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో మేనేజర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పోస్టుల వివరాలు ఇవే..

  • మేనేజర్ – క్రెడిట్ అనలిస్ట్ పోస్టుల సంఖ్య: 4
  • సీనియర్ మేనేజర్- క్రెడిట్ అనలిస్ట్ పోస్టుల సంఖ్య: 38
  • చీఫ్ మేనేజర్- క్రెడిట్ అనలిస్ట్ పోస్టుల సంఖ్య: 1
  • సీనియర్ మేనేజర్- సీ అండ్‌ ఐసీ రిలేషన్‌షిప్ పోస్టుల సంఖ్య: 36
  • చీఫ్ మేనేజర్- సీ అండ్‌ ఐసీ రిలేషన్‌షిప్‌ పోస్టుల సంఖ్య: 7

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీతోపాటు ఫైనాన్స్ స్పెషలైజేషన్‌లో పీజీ /డిప్లొమా లేదా సీఏ/ సీఎంఏ/ సీఎస్‌/ సీఎఫ్‌ఏ వంటి అర్హతలు కలిగి ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత బ్యాంకింగ్/ ఫైనాన్స్ అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి మేనేజర్‌ పోస్టులకు 25 నుంచి 30 ఏళ్లు, సీనియర్‌ మేనేజర్‌ పోస్టులకు 28 నుంచి 35 ఏళ్లు, చీఫ్‌ మేనేజర్‌ పోస్టులకు 32 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు వయసులో వయోసడలింపు వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలోజులై 6, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్ధులు రూ.850, ఎస్సీ/ ఎస్టీ, మహిళలు, ఎక్స్‌సర్విస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్‌ రాత పరీక్ష, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు గ్రేడ్‌ 2 పోస్టులకు రూ.93,960, గ్రేడ్‌3 పోస్టులకు రూ.1,05,280, గ్రేడ్‌ 4 పోస్టులకు రూ.1,20,940 చొప్పున జీతంతోపాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో మేనేజర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us