BRS: బీఆర్‌ఎస్‌ నేత మృతికి నివాళులు అర్పించిన కేటీఆర్‌..

పాగాల సంపత్‌ రెడ్డి మరణంపై బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ నివాళులు అర్పించారు. ఆ తర్వాత సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పాగాల...

BRS: బీఆర్‌ఎస్‌ నేత మృతికి నివాళులు అర్పించిన కేటీఆర్‌..
KTR
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 06, 2023 | 12:01 PM

జనగామ జడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్‌ రెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో డిసెంబర్‌ 4వ తేదీన తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా కింద పడిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స అందిస్తుండానే ఆయన తుదిశ్వాస విడిచారు.

పాగాల సంపత్‌ రెడ్డి మరణంపై బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ నివాళులు అర్పించారు. ఆ తర్వాత సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పాగాల సంపత్‌రెడ్డి హఠాన్మరణం బాధాకరమన్నారు.

Mla Ktr

14 ఏళ్లు కేసీఆర్ వెంట సైనికుడిలా ఉండి పని చేశారని, సంపత్‌రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా సంపత్‌ రెడ్డి క్రియాశీలకంగా పని చేశారని, నిబద్ధతో పనిచేశారని కేటీఆర్‌ గుర్తు చేసుకున్నారు. ఇక సంపత్‌ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జెడ్పీఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!