AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ కాంగ్రెస్‌ విజయంలో ఆ నాయకుడి పాత్ర కీలకం.. కీలక బాధ్యత అప్పగించే యోచనలో అధిష్టానం.

బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఎజెండాతో ఎన్నికలు వెళ్లినా తెలంగాణలో కాంగ్రెస్‌ హవాకు అడ్డుకట్టపడలేకపోయింది. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ జెండా ఎగరడానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించాడనేది మెజారిటీ అభిప్రాయం ఉంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ విజయంలో మరో నాయకుడు కీలక పాత్ర పోషించారు...

తెలంగాణ కాంగ్రెస్‌ విజయంలో ఆ నాయకుడి పాత్ర కీలకం.. కీలక బాధ్యత అప్పగించే యోచనలో అధిష్టానం.
TS Congress
Narender Vaitla
|

Updated on: Dec 05, 2023 | 1:31 PM

Share

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే ఒక్క తెలంగాణలోనే మెజారిటీ మార్కును దాటగలిగింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరున్న కాంగ్రెస్‌కు రెండుసార్లు పరాజయం తర్వాత మూడోసారి విజయకేతనం ఎగరవేసింది.

బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఎజెండాతో ఎన్నికలు వెళ్లినా తెలంగాణలో కాంగ్రెస్‌ హవాకు అడ్డుకట్టపడలేకపోయింది. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ జెండా ఎగరడానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించాడనేది మెజారిటీ అభిప్రాయం ఉంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ విజయంలో మరో నాయకుడు కీలక పాత్ర పోషించారు. ఆ నాయకుడు మరెవరో కాదు మహారాష్ట్రాకు చెందిన మాణిక్‌ రావు ఠాక్రే.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ విజయం తర్వాత ఠాక్రేకు పెద్ద బాధ్యతలు అప్పగించే యోజనలో కాంగ్రెస్‌ అధిష్టానం ఉంది.

తెలంగాణ రాష్ట్రానికి మహారాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుడు మాణిక్‌రావ్‌ ఠాక్రే ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఠాక్రే నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్‌ వ్యూహాలు ఫలించాయి. దీంతో తెలంగాణ విజయంలో స్థానిక నేతల పాత్రతో పాటు ఠాక్రే పాత్ర కూడా ఉందని కాంగ్రెస్‌ అధిష్టానం విశ్వసిస్తోంది.

తెలంగాణలో విజయం తర్వాత మాణిక్‌రావ్‌ ఠాక్రేకు పార్టీ మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. మహారాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న హెచ్‌కే పాటిల్‌ స్థానంలో కొత్త ఇంచార్జిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇక మరో రానున్న నెలల్లో జరగనున్న పార్లమెంట్‌ ఎలక్షన్ల నేపథ్యంలో మాణిక్‌రావు ఠాక్రేకు పెద్ద బాధ్యతను అప్పగించే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..