TS Rains: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు..
తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు (బుధ, గురువారాల్లో) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి...

మిచౌంగ్ తుఫాన్ తమిళనాడు, ఏపీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న విషయం తెలిసిందే. మంగళవారం బాపట్ల సమీపం తీరం దాటిన తుఫాన్ వాయుగుండంగా బలహీన పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. ఇక తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా భారీగానే పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు (బుధ, గురువారాల్లో) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, నల్లగొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నయాని తెలిపిన వాతావారణ శాఖ, ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.
అలాగే జనగామ, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ క్రమంలోనే ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదుగుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతా ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను గుర్తించాలని ఆదేశించారు.
ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని, టార్పాలిన్ల పంపిణీపై దృష్టి పెట్టాలని సూచించారు. తుఫాను ప్రభా వం ఎక్కువగా ఉన్న ఈశాన్య జిల్లాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..