Yadadri Temple: యాదాద్రి ఆలయ విమాన గోపురానికి రాగి తాపడం పూర్తి.. స్వర్ణ తాపర పనులకు రంగం సిద్ధం
ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమానగోపుర బంగారు తాపడం పనులు వేగం పుంజుకున్నాయి. స్వర్ణ పూత పూసే ముందు గోపురానికి రాగి తాపడం పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచి పోయేలా పునర్నిర్మాణం చేపట్టారు. మహా కుంభ సంప్రోక్షణ నేపథ్యంలో గతేడాది అక్టోబర్‌లో మాజీ సీఎం కేసీఆర్ లక్ష్మీ నరసింహస్వామి దివ్య విమాన..

యాదాద్రి, డిసెంబర్ 5: ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమానగోపుర బంగారు తాపడం పనులు వేగం పుంజుకున్నాయి. స్వర్ణ పూత పూసే ముందు గోపురానికి రాగి తాపడం పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచి పోయేలా పునర్నిర్మాణం చేపట్టారు. మహా కుంభ సంప్రోక్షణ నేపథ్యంలో గతేడాది అక్టోబర్‌లో మాజీ సీఎం కేసీఆర్ లక్ష్మీ నరసింహస్వామి దివ్య విమాన గోపురాన్ని125 కిలోల స్వచ్ఛమైన బంగారంతో తాపడం చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు భక్తులందరిని భాగస్వామ్యం చేస్తున్నారు.
స్వామి వారి దివ్య విమాన గోపురాన్ని బంగారు తాపడం కోసం మొదటగా తన కుటుంబం నుంచి కిలో 16 తులాల బంగారం విరాళంగా ప్రకటించి కుటుంబంతో కలిసి వచ్చిన కేసీఆర్ స్వామివారికి అందజేశారు. బంగారు తాపడానికి మొత్తం 125 కిలోల బంగారం.. రూ.65 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఇప్పటివరకు సుమారు 29 కోట్ల రూపాయలు సమకూరింది. దాతల నుంచి కేవలం 50 కిలోల బంగారం, రూ. 23 కోట్లు మాత్రమే సమకూరింది. మొత్తం సమకూరాక రిజర్వు బ్యాంకు నుంచి స్వచ్ఛమైన బంగారం కొనుగోలు చేసి, స్వామి వారి గర్భగుడి దివ్య విమానానికి బంగారు తాపడం చేయాలని వైటీడీఏ ప్లాన్ చేసింది. ఇప్పటికే ప్రధానఆలయం గర్భగుడి ముఖద్వారం, కలశాలు, తోరణాలకు బంగారు పూత పూశారు. గర్భాలయం పసిడి కాంతులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
గర్భాలయానికి 45 అడుగుల ఎత్తులోని దివ్య విమానానికి స్వర్ణమయం చేయాలని వైటీడీఏ భావిస్తోంది. దివ్య విమాన గోపురానికి స్వర్ణ తాపడానికి ముందు గోపురానికి రాగి మోల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ పనుల ప్రక్రియ పూర్తి కావడంతో పసిడి పూత పనులపై అధికారులు దృష్టి సారించాయి. రాగి తాపడానికి 10,680 కిలోలు వినియోగించారు. విమాన గోపురం చుట్టూ తొమ్మిది వేల కిలోలు, విగ్రహాలకు 1680 కిలోల రాగి పట్టింది. ఈ తాపడం పనులకు రూ.5.40 కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. రాగి మోల్డింగ్ కలిగిన శిల్పాలపై పసిడి పూత పూసేందుకు సాంకేతిక నిపుణులు, స్థపతులు సిద్ధమవుతున్నారు. స్వర్ణ తాపడ పనుల్లో ప్రతిష్ఠాత్మక సంస్థలు పాలుపంచు కుంటున్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన యాదాద్రి క్షేత్ర విమానగోపురానికి బంగారు తాపడం పూర్తి అయితే మరింత శోభిళ్లనుంది.
No.1 న్యూస్ నెట్‌వర్క్.. No.1 ఎలక్షన్ కవరేజ్.. డిజిటల్ రంగంలో రికార్డులు బద్దలు కొట్టిన టీవీ9 తెలుగు..
NO FAKE NO BOTJUST ORIGINAL
డిజిటల్ రంగంలో అన్ని రికార్డులను బద్దలు కొట్టిన #TV9Telugu pic.twitter.com/nBSqWBMn6R
— TV9 Telugu (@TV9Telugu) December 5, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.