AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రాజయ్య పొలిటికల్ లైఫ్‌ ఏ మలుపు తీసుకోనుంది.? అధినేత మనసులో అసలు ఏముంది.?

కేవలం జనగామ సీటు మాత్రమే ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. టికెట్ల ప్రకటన తర్వాత హాట్ సీట్‌గా పేరున్న స్టేషన్ ఘనపూర్‌లో రాజకీయం మరింత వేడెక్కింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్థానంలో స్టేషన్‌ఘన్‌పూర్‌ టికెట్‌ని ఎమ్మెల్సీ కడియం శ్రీహరికిచ్చారు పార్టీ అధినేత. అసలే ఆ ఇద్దరి మధ్య మొదట్నించీ రచ్చ నడుస్తోంది. తన టికెట్‌ని కడియం లాగేసుకోవటంతో పోరాడితే పోయేదేంలేదన్నట్లు దూకుడుపెంచారు రాజయ్య. కడియంకు తన సిట్టింగ్‌సీటును కట్టబెట్టడంతో స్వరం పెంచిన రాజయ్య...

Telangana: రాజయ్య పొలిటికల్ లైఫ్‌ ఏ మలుపు తీసుకోనుంది.? అధినేత మనసులో అసలు ఏముంది.?
Rajaiah Political Career
Narender Vaitla
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 07, 2023 | 8:16 PM

Share

రాజన్న దారెటు…? ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు నిరాకరించిన గులాబీ బాస్ ఆయనకు ఇచ్చిన ఆఫర్ ఏంటి..? ప్రతిపక్ష పార్టీలు ఇస్తున్న ఆఫర్స్ ఏంటి.? డాక్టర్ సాబ్ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి..? వరంగల్ ఉమ్మడి జిల్లాలో చర్చగా మారిన స్టేషన్ ఘన్‌పూర్‌లో ఏం జరగనుంది.? లాంటి అంశాలపై ప్రత్యేక కథనంపై ఓ లుక్కేయండి.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 9 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ సీట్లు ఖరారు చేసిన గులాబీ బాస్ కేసీఆర్ జనగామ జిల్లాలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటులేదని చెప్పేశారు.

కేవలం జనగామ సీటు మాత్రమే ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. టికెట్ల ప్రకటన తర్వాత హాట్ సీట్‌గా పేరున్న స్టేషన్ ఘనపూర్‌లో రాజకీయం మరింత వేడెక్కింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్థానంలో స్టేషన్‌ఘన్‌పూర్‌ టికెట్‌ని ఎమ్మెల్సీ కడియం శ్రీహరికిచ్చారు పార్టీ అధినేత. అసలే ఆ ఇద్దరి మధ్య మొదట్నించీ రచ్చ నడుస్తోంది. తన టికెట్‌ని కడియం లాగేసుకోవటంతో పోరాడితే పోయేదేంలేదన్నట్లు దూకుడుపెంచారు రాజయ్య. కడియంకు తన సిట్టింగ్‌సీటును కట్టబెట్టడంతో స్వరం పెంచిన రాజయ్య సంచలన వ్యాఖ్యలతో కాక రేపుతున్నారు. మొదట తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు ఎమ్మెల్యే. ఆయన్ని చూసిన కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు అయ్యో రాజయ్యా అన్నారు. పార్టీ పెద్దలనుంచి బుజ్జగింపు ప్రయత్నాలు జరుగుతున్నా.. స్వరం పెంచిన ఎమ్మెల్యే రాజయ్య ఇప్పుడు కడియం శ్రీహరిపై బాణాలు ఎక్కు పెట్టారు.

తన జాతిని ఐక్యం చేస్తున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన రాజయ్య.. రిజర్వుడ్‌ సీట్లో ఆ వర్గమంతా తనవైపేనంటూ బలప్రదర్శనకు దిగుతున్నారు. కడియం శ్రీహరిలో కలవరం పుట్టిస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ మొదట్నించీ ఎస్సీల్లో మెజారిటీ వర్గానికి ఇస్తున్న సీటు. ఈసారి కూడా ఆ సీటుని మాదిగలకే కేటాయించాలన్న డిమాండ్ చేస్తూ బలమైన వాదన వినిపిస్తున్నారు రాజయ్య. ఎమ్మార్పీఎస్‌ అధినేత మంద కృష్ణమాదిగతో పాటు, మాదిగ అనుబంధ సంఘాల్లో ఓవర్గం ఆయనకు మద్దతుగా నిలిచింది. దళిత మేధావులు, ఆ వర్గ ప్రజా ప్రతినిధులను సమన్వయపరిచి స్టేషన్ ఘనపూర్ సీటు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు సిట్టింగ్‌ ఎమ్మెల్యే.

ఇవి కూడా చదవండి

రాజనర్సింహతో భేటీ ఆసక్తి..

ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహని హనుమకొండలో కలవడం చర్చకు దారి తీసింది. రాజనర్సింహతో హోటల్ గదిలో కాసేపు రాజయ్య చర్చించడంతో.. ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరిగింది. పార్టీ వీడతానన్న ప్రచారానికి తెరదించారు రాజయ్య. పార్టీ మారే ఆలోచన లేదని ప్రకటించారు. మాదిగల అస్థిత్వానికి అన్యాయం జరగకుండా చూసేందుకే పోరాడుతున్నానన్నారు రాజయ్య. దామోదర రాజనర్సింహతో భేటీతో బీఆర్‌ఎస్ నాయకత్వం అప్రమత్తమైంది. రాజయ్యకి బుజ్జగింపుల పర్వం మొదలైంది. అధిష్ఠాన దూతగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ రంగంలోకి దిగారు. రాజయ్య ఇంటికి వెళ్లి మంతనాలు జరపడం, ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేయడం ఘన్‌పూర్‌ రాజకీయంలో లేటెస్ట్‌ అప్‌డేట్‌. ఇప్పటికే గులాబీ బాస్ రాజయ్యకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఎమ్మెల్సీ లేదంటే వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి రాజయ్యను బరిలోకి దింపే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.

అధినేత మనసులోని మాట పార్టీ నేతలద్వారా రాజయ్యకి చేరిందంటున్నారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయన ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవుతుంది.. కాబట్టి ఆ సీటును రాజయ్యకు కేటాయించడమో లేదంటే వరంగల్‌ ఎంపీ గా ఆయన్ని బరిలోకి దింపే ఆలోచనలో కూడా బీఆర్‌ఎస్ నాయకత్వం ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వరంగల్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ పెద్దగా ప్రభావం పెద్దగా కనిపించకపోవడంతో ఆయన స్థానంలో అదే మాదిగ సామాజిక వర్గానికి చెందిన రాజయ్యని దించే ఆలోచన కూడా చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఓవైపు బీఆర్‌ఎస్ నాయకత్వం రాజయ్యకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగానే.. అటు కాంగ్రెస్‌నుంచి కూడా ఆయనకు ఆఫర్‌ ఉందన్న మాట వినిపిస్తోంది. పార్టీలో చేరితే స్టేషన్‌ఘన్‌పూర్‌ టికెటిస్తామని ఆఫర్‌ చేసిందట కాంగ్రెస్‌ పార్టీ. మరి రాజయ్య అధికారపార్టీలోనే కొనసాగి అధినేత ఆఫర్‌ని అందుకుంటారా.. లేదంటే ఇదే స్పీడ్‌ కంటిన్యూ చేస్తారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. అయితే ఎమ్మెల్సీ లేదా ఎంపీ ఆఫర్ రెండూ ఇచ్చినా.. అందులో ఏదయినా సరే ముందే ప్రకటించాలని పట్టుబడుతున్నారట రాజయ్య. మరి ఆఫర్లకు రాజయ్య సరెండర్ అవుతారా.. లేక తగ్గేదే లేదంటూ తాడోపేడో తేల్చుకుంటారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...