AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న సెప్టెంబర్‌ 17.. ఇంతకీ ఆ రోజు ఏం జరగనుంది.?

మరీ ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికలు సమీపించడంతో సెప్టెంబ‌ర్ 17న ప్రత్యేక కార్యక్రమాలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అగ్రనాయకుల సభలకు కాంగ్రెస్‌- బీజేపీ నేతలు ప్లాన్‌ చేయడంతో రాజకీయం వేడెక్కింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడడటంతో సెప్టెంబ‌ర్ 17న బీజేపీ-కాంగ్రెస్‌ పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలకు ప్లాన్‌ చేస్తున్నాయి. ఈ నెల 16, 17 తేదీల్లో CWC సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ PCC సిద్ధమవుతోంది. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు...

Telangana: తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న సెప్టెంబర్‌ 17.. ఇంతకీ ఆ రోజు ఏం జరగనుంది.?
Telangana Politics
Narender Vaitla
|

Updated on: Sep 07, 2023 | 5:35 PM

Share

సెప్టెంబర్‌ 17వ తేదీ వస్తుందంటే చాలు ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడేక్కుతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు నుంచి ఈ తేదీకి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విమోచం, విలీనం, విద్రోహం ఇలా రకరకాల పేర్లతో సెప్టెంబర్‌ 17 పొలిటిక్‌ సర్కిల్స్‌లో హాట్‌ హాట్‌గా మారుతుంటుంది. ఇక ఈ ఏడాది కూడా సెప్టెంబర్‌ 17వ తేదీ తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఈసారి తెలంగాణ రాజకీయాల్లో ఏకంగా జాతీయ స్థాయిలో చర్చకు కేంద్ర బిందువు కానుంది. సెప్టెంబర్ 17న కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు పోటాపోటీన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

మరీ ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికలు సమీపించడంతో సెప్టెంబ‌ర్ 17న ప్రత్యేక కార్యక్రమాలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అగ్రనాయకుల సభలకు కాంగ్రెస్‌- బీజేపీ నేతలు ప్లాన్‌ చేయడంతో రాజకీయం వేడెక్కింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడడటంతో సెప్టెంబ‌ర్ 17న బీజేపీ-కాంగ్రెస్‌ పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలకు ప్లాన్‌ చేస్తున్నాయి. ఈ నెల 16, 17 తేదీల్లో CWC సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ PCC సిద్ధమవుతోంది. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో పాటు కాంగ్రెస్‌ అగ్రనాయకులు, ప్రతినిధులు, ఇతర నాయకులు కలిపి దాదాపు 3 వందల మంది హాజరయ్యే అవకాశం ఉందని పీసీసీ అంచనా వేస్తోంది. ఆ స్థాయిలో ఏర్పాట్లపై PCC ఫోకస్ పెట్టింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభకు కమలం పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం తమ తమ పోలింగ్ బూతుల్లో జాతీయ జెండా ఆవిష్కరించి.. సాయంత్రం సభకు వచ్చే విధంగా బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది కూడా సెప్టెంబర్‌ 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ముగింపులో భాగంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ కూడా ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్లు దూకుడు ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి కేసీఆర్‌ రూటు మార్చారు. బీజేపీ, కాంగ్రెస్‌ల ఎత్తుగడలకు చెక్‌ పెట్టేలే సెప్టెంబర్‌ 16వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని నిర్ణయించిన బీఆర్‌ఎస్‌ పార్టీ అదే రోజు భారీ బహిరంగ సభను నిర్వహించాలని చూస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్‌ 17 మరోసారి సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!